కరోనాకు రాజు పేద తేడా లేదు.. తుపాకీ, బాంబుల భయం లేదు. అది ఎవరికైనా వస్తుంది. దాన్ని ఆహ్వానిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వచ్చి ఒంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుంది. ఇందుకు తాజా ఉదాహరణ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే వ్యవహారం. అవును.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ ఠాక్రే కు కరోనా వచ్చే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

 

 

ఎందుకంటే.. ముఖ్యమంత్రి భద్రత సిబ్బందిలో ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ సోకింది. అందులోనూ వారు సి.ఎమ్. ఇంటి వద్దే భద్రత విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ విషయం తెలియగానే సీఎం సెక్యురిటీ సిబ్బందిని తక్షణం ఆస్పత్రికి తరలించారు. భద్రత సిబ్బంది కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్ లో ఉంచారు. ముఖ్యమంత్రి సిబ్బందికి వచ్చిన కారణంగా సీఎంకూ కరోనా వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు.

 

 

అందుకే ఉద్దవ్ ఠాక్రే కు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా రెచ్చిపోతోంది. దేశంలోనే అత్యధిక కేసులు ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డులకెక్కింది. దీంతో ఇప్పటికే ఉద్దవ్ ఠాక్రే టెన్షన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన భద్రతా సిబ్బందే కరోనా సోకడం అధికార యంత్రాంగాన్ని నివ్వెరపరుస్తోంది.

 

 

మహారాష్ట్రలో కరోనా పరిస్థితి దారుణంగా తయారవుతోంది. తాజాగా ఒక్క రోజే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి కూడా. తాజాగా బాంబే ఐఐటి క్యాంపస్ లో ఉంటున్న ఒక వ్యక్తి భార్యకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఆ కుటుంబాన్ని క్వారంటైన్ లో ఉంచారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఇప్పటి వరకూ 11 వేలు దాటిపోగా.. దాదాపు 480కి పైగా రోగులు మృతి చెందారు. ఇప్పుడు ఏకంగా సీఎం భద్రతాసిబ్బందికే కరోనా రావడం కలకలం సృష్టిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: