చైనా కరోనా వైరస్ విషయంలో ప్రపంచాన్ని తప్పుదోవ పెట్టిందని ప్రపంచమంతా అనుమానిస్తోంది. అనుమానించడమే కాదు బలంగా నమ్ముతోంది కూడా. కరోనా వైరస్ ఓ వైపు వూహన్ లో మరణ మృదంగం మోగిస్తున్న సమయంలోనూ కరోనా విమాన ప్రయాణాలపై నిషేధం విధించలేదు. ప్రపంచ దేశాలకు కానీ.. ప్రపంచఆరోగ్య సంస్థకు కానీ సరైన సమాచారం అందించలేదు.

 

 

ఈ వి।షయాన్ని అమెరికాతో సహా అనేక దేశాలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ మరి చైనా అలా ఎందుకు చేసి ఉంటుంది.. ఈ ప్రశ్నకు అనేక సమాధానాలు ఉన్నాయి. ఇందుకు తాజాగా అమెరికా చెబుతున్న సమాధానం వింటే షాక్ కలగకమానదు. కరోనా కు సంబంధించిన ఔషధాలను నిల్వ చేసుకోవడానికే చైనా ఇలా చేసి ఉండవచ్చని అమెరికా తాజాగా ఆరోపిస్తోంది.

 

 

కరోనా గురించి నిజాలు దాస్తూ.. దాన్ని తక్కువ చేసి చూపుతూనే చైనా కరోనా మందుల దిగుమతుల్ని పెంచుకుందని, ఎగుమతుల్ని తగ్గించిందని అమెరికాకు చెందిన గూఢాచర సంస్థ తాజాగా ఓ నివేదికలో ఆరోపించింది. ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవని చెబుతూ... అస్పష్టమైన వాణిజ్య వివరాలతో దాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించిందని ఈ సంస్థ ఆరోపించింది.

 

 

చైనా ప్రపంచ దేశాల నుంచి కరోనాను కట్టడి చేసే ఔషధాల్ని దిగుమతి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు సైతం ఇది అంటువ్యాధి అన్న విషయం చైనా చెప్పలేదని ఈ సంస్థ అంటోంది. ఇందుకు ఉదాహరణగా చైనా దిగుమతి చేసుకున్న మాస్కులు, సర్జికల్ గౌన్ల గణాంకాలను ఆ నివేదికలో ప్రస్తావించారు. అంటే చైనా తనను తాను కాపాడుకోవడం కోసం.. తన ప్రజలకు మందులు, సౌకర్యాలు అందించడం కోసం ఏకంగా ప్రపంచాన్ని బలిపెట్టిందన్నది అమెరికా ఆరోపణ. మరి ఇందులో నిజం ఎంతో..?

మరింత సమాచారం తెలుసుకోండి: