కరోనా వైరస్ ప్రభావం మొదలైన దగ్గర నుంచి ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అయితే కరోనాపై ఏ స్థాయిలో రాజకీయం జరుగుతుందో అదే స్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లో ఉండటంపై రాజకీయం జరుగుతూ వస్తుంది. లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉండిపోయిన చంద్రబాబు, అక్కడ నుంచే కరోనా పట్ల ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే, జగన్ ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

 

అయితే అలా హైదరాబాద్ లో ఉండి ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని వైసీపీ నేతలు రివర్స్ లో విమర్శలు చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు ఏపీకి వచ్చి సలహాలు ఇవ్వాలని, ఒకవేళ బాబు ఏపీకి వచ్చిన హోమ్ క్వారంటైన్ లో ఉండాలని మాట్లాడారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు స్పందించారు. ఇన్ని రోజులు ఏపీకి రావడంపై పెద్దగా మాట్లాడని బాబు, ఇప్పుడు సడన్ ఏపీకి వస్తానని మాట్లాడారు.

 

అలాగే ఏపీకి తాను వస్తే క్వారంటైన్‌లో పెడతామంటున్న వైసీపీ నేతలు.. వారు మాత్రం యధేచ్చగా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. తాను ఏపీకి వస్తే క్వారంటైన్‌లో ఉంటానని స్పష్టం చేశారు. అంటే మొత్తానికి చంద్రబాబు వైసీపీ నేతలు చేస్తున్న డిమాండ్ కు ఒప్పుకున్నారు. అయితే బాబు ఇంట సడన్ గా ఏపీకి వస్తే క్వారంటైన్ లో ఉంటానని ఎందుకు చెబుతారనే విషయం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.

 

ఇదే సమయంలో లాక్ డౌన్ నింబంధలని సడలించి మద్యం అమ్మకాలకు జగన్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అయితే వైన్ షాపులు దగ్గర పెద్ద ఎత్తున క్యూలు దర్శనమిస్తున్నాయి. అసలు మందుబాబులు ఏ మాత్రం సామాజిక దూరం పాటించకుండా, క్యూల్లో ఉంటున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం కరోనా వ్యాప్తికి కృషి చేస్తుందని, అసలు ఇలాంటి సమయంలో మద్యం షాపులు ఎలా ఓపెన్ చేస్తారని, ప్రతిపక్షాలతో పాటు మహిళలు కూడా ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల ఈ మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి కొంత మైనస్ గా మారింది. దీంతో ఇదే సమయంలో బాబు ఏపీకి వచ్చి దీనిపై రాజకీయం చేసి, లబ్ది పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి బాబు ఏపీకి వస్తారో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: