తప్పు చేసిన వారిని విమర్శించడం సహజం. అది తప్పు కాకపోయినా తిట్టేవాడి దృష్టిలో తప్పే అయితే కచ్చితంగా తిడతాడు.. అదీ సహజం. కానీ ఒకే తప్పు చేసిన ఇద్దరిపై తిట్టేవాడి తిట్లు ఒకలాగానే ఉండాలి కదా. ఒకే పని చేసిన ఇద్దరిలో ఒకరిని తిట్టడం.. మరొకరిని పొగడటం దేనికి సంకేతం.. ఈ విషయమంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. చంద్రబాబు వ్యవహార శైలి అలా ఉంది మరి.

 

 

దేశంలో మోడీ గ్రీన్ జోన్లలో మద్యం అమ్ముకోండి పర్వాలేదు అన్నాడు. చాలా రాష్ట్రాలు ఓకే సార్ అనేసి ఆయన చెప్పినట్టే మద్యం అమ్మకాలు ప్రారంభించాయి. అయితే ఓవైపు కరోనా విజృంభిస్తుంటే.. ఇప్పుడు మద్యం అమ్మకాలు ప్రారంభించడమేంటని చంద్రబాబు మండిపడుతున్నాడు. ఓకే.. అది ఆయన అభిప్రాయం.. ఆయన అలా విమర్శించడం తప్పేమీ కాదు.

 

 

అయితే విచిత్రం ఏంటంటే.. మద్యం అమ్ముకోండని చెప్పిన మోడీ గురించి మాత్రం బాబు నోరు మెదపడం లేదు.. కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేసిన జగన్ పై మాత్రం మండి పడుతున్నారు. విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇలా చంద్రబాబు ఎందుకు చేస్తున్నారు... ఇందుకు సమాధానం వైసీపీ మంత్రి ఆళ్ల నాని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు మోదీని నోటికి వచ్చినట్లు తిట్టారని, తన బావమరిది, కుమారుడు, తన అనుచరులతో ఇష్టం వచ్చినట్లు దూషించారని అందుకే మోడీ అంటే ఇప్పుడు చంద్రబాబు భయపడిపోతున్నారని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు.

 

 

అందుకే చంద్రబాబు ఇప్పుడు మోదీని పొగడ్తలతో ముంచుతున్నారని ... తేల్చేశారు. ఓటుకు నోటు కేసు, ముంబయిలో పట్టుబడిన వేల కోట్ల బ్లాక్‌ మనీ కేసులో ఎక్కడ మోదీ జైల్లో పెడతారన్న భయంతో ప్రధానిని పొగుడుతున్నారని అంటున్నారు. ప్రధాన మంత్రే దేశవ్యాప్తంగా బ్రాందీ షాపులు తెరవాలని ఆదేశించారరని.. జగన్ దాన్ని పాటించారని ఆళ్లనాని అంటున్నారు. మోదీని ప్రసన్నం చేసుకునేందుకు ఆయనకు చంద్రబాబు ప్రేమ సందేశాలు పంపుతున్నారని, రాష్ట్రంలో మాత్రం సీఎం వైయస్‌ జగన్‌పై నిత్యం విషం చిమ్ముతున్నారన్నారని అంటున్నారు. మరి లాజిక్కే కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: