వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై విమర్సలు చేస్తారనే విషయం తెలిసిందే. అయితే ఎప్పటి మాదిరిగానే తాజాగా కూడా విజయసాయి సోషల్ మీడియా వేదికగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యంలో జగన్ ప్రభుత్వం జె ట్యాక్స్ వసూలు చేస్తుందని, విరాళాల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని  టీడీపీ నేతలు చేసే విమర్శలకు గట్టి కౌంటర్లు ఇచ్చారు. ఈక్రమంలోనే తెలుగు తమ్ముళ్లపై విజయసాయి జాలి చూపించారు.

 

విశాఖలో హుదూద్‌ను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి అప్పట్లో ఏకంగా రూ. 100 కోట్ల వరకు ఎన్టీఆర్‌ ట్రస్టులోకి లాగారని,  తుఫాను బాధితులకు పంచకుండా పెదబాబు, చినబాబులు ఈ మొత్తం సొమ్మును మింగేశారని మండిపడ్డారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలని, త్యాగాలు మీవి...భోగాలు వారివని, ఇప్పటికైనా బాబుని నిలదీయాలని కోరారు.

 

అయితే ఇలా నిజాలు తెలుసుకుని, తెలుగు తమ్ముళ్లపై విజయసాయి జాలి చూపిస్తే, వారెమో రివర్స్ లో విజయసాయిపైనే కౌంటర్లు వేస్తున్నారు.  మీరు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, ఇలా బాబుపై అర్థంలేని విమర్సలు చేస్తున్నారని సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇక మద్యపాన నిషేధంలో భాగంగానే 75 శాతం ధరలు పెంచామని చెప్పడంలో ఏమైనా అర్ధం ఉందని అడుగుతున్నారు. ధరలు పెంచితే వైన్ షాపులు దగ్గర క్యూలో మనుషులు తగ్గాలి కదా అని ప్రశ్నిస్తున్నారు.

 

ఇక హుదూహుద్ తుఫాన్ అప్పుడు వచ్చిన విరాళాలు చంద్రబాబు మింగేస్తే విచారణ చేసి నిజానిజాలు తేల్చాలని, అలా కాకుండా ఇలా గుడ్డిగా విమర్సలు చేయొద్దని అంటున్నారు. ఇదే సమయంలో ఆధారాలు లేకుండా మద్యంలో జె ట్యాక్స్, విరాళాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని లేనిపోని ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఏదేమైనా గాని విజయసాయి చెప్పిన నిజాలు తెలుగు తమ్ముళ్లు అర్ధం చేసుకున్నట్లు లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: