కరోనా.. నిన్న మొన్నటి వరకూ ఈ కరోనాను తిట్టుకోని వారు లేదు. ఇది మాయదారి రోగం ఎప్పుడు పోతుందా అని జనం ఎదురు చూస్తున్నారు. విశాఖ వాసులూ ఇందుకు మినహాయింపు కాదు.. అయితే ఇప్పుడు అదే కరోనా విశాఖ వాసులను కాపాడింది. విశాఖకు భారీ ప్రాణ నష్టాన్ని తప్పించింది. కాస్త విడ్డూరంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే.. కరోనా నియంత్రణ కోసం.. కరోనా రోగుల కోసం ముందస్తు జాగ్రత్తగా భారీగా ఉంచిన అంబులెన్సులు ఇప్పుడు విశాఖ గ్యాస్ బాధితులకు ఆపద్భాంధవులయ్యాయి.

 

 

కాస్త వివరంగా చెప్పాలంటే.. విశాఖ గ్యాస్ లీక్ ఘటన రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే భయాందోళనలు కలిగించింది. ప్రమాద ఘటన వార్తకు సంబందించిన ఫోటోలు, వీడియోలు ప్రసారం కాగానే.. విశాఖలో భారీ ప్రాణ నష్టం తప్పదేమో అన్న ఆందోళన అందరిలోనూ కనిపించింది. అయితే పది మంది ప్రాణాలు కోల్పోవడం చిన్న నష్టం కాకపోయినా.. ఊహించినంత భారీ ఉత్పాతం కాకపోవడం కాస్త ఊరట కలిగించింది.

 

 

వాస్తవానికి స్టెరీన్ గ్యాస్ ఉత్పాతానికి విశాఖలో కనీసం వందల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పేయే దుస్థితి వచ్చి ఉండేది. విశాఖలో కరోనా ప్రభావం లేకపోతే.. అన్ని ముందస్తు అంబులెన్సులు అందుబాటులో ఉండేవి కాదు.. అందరు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేవారు కాదు. కేజీహెచ్‌లో ముందస్తుగా అన్ని బెడ్లు సిద్ధంగా ఉండేవి కాదు. కరోనా మహమ్మారి లేకుండా ఉండి.. సాధారణ రోజుల్లో ఈ ప్రమాదం జరిగి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని నిపుణులు చెబుతున్నారు.

 

 

కరోనా కోసం అంతా సిద్ధంగా ఉండటం వల్ల.. బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించగలిగారు. వారి ప్రాణాలు కాపాడగలిగారు. అదే సాధారణ రోజుల్లో అయితే భారీ ప్రాణ నష్టం సంభవించి ఉండేదని నిపుణులే చెబుతున్నారు. సో.. స్టెరీన్ వాయువు విశాఖఖ వాసుల ప్రాణాలు తీయబోతే.. కరోనా కాపాడిందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: