కోవిడ్‌ 19 కాకుండా కోవిడ్‌యేతర కేసులు ప్రతి రోజూ ఎన్ని వస్తున్నాయన్న దానిపై వివరాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.  డాక్టర్లు ప్రిస్కిప్షన్‌ ఇవ్వగానే 24 గంటల్లోగా మందులు అందేలా చూడాలని,   సిబ్బందికి బైకు, థర్మో బ్యాగు అందుబాటులో ఉంచాలన్నారు.  కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారందరికీ పరీక్షలు పూర్తి చేశామన్న అధికారులు పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలన్న సీఎం  ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు కూడా దీంట్లో భాగమన్నారు  సీఎం జగన్ మోహన్ రెడ్డి.

 

విదేశాల నుంచి వచ్చిన వారి క్వారంటైన్‌:

విదేశాల్లో చిక్కుకుపోయిన వారు దేశంలోకి రాక ప్రారంభమైందన్న అధికారులు
గల్ఫ్‌ నుంచి కాకుండా యూకే, యూఎస్‌ నుంచి కూడా కొంత మంది వచ్చే అవకాశాలున్నాయన్న అధికారులు  వారందరికీ క్వారంటైన్‌ ఫెసిలిటీస్‌ బాగా చేయాలన్న సీఎం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న షెల్టర్లు, క్వారంటైన్‌ కేంద్రాలు బాగుండేలా చూడాలన్న సీఎం  నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్న 75 వేలకు పైగా పడకలను ముందస్తుగా వినియోగించుకోవాలన్నారు. వాటి సంఖ్యను 1 లక్ష వరకూ పెంచాలన్నారు. 
75 వేల క్వారంటైన్‌ పడకలు వినియోగించినా, మిగిలినవి స్పేర్‌లో ఉంచాలని, వాటన్నింటిలో ఏ లోటు లేకుండా సదుపాయాలు కల్పించాలన్నారు. 
క్వారంటైన్‌లలో సదుపాయాలను మెరుగుపర్చడంపై దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. 

వ్యవసాయంపై సమీక్ష:

10 వేల టన్నుల బత్తాయిల కొనుగోలుకు రెడీగా ఉండాలి.  రిటైల్‌ అమ్మకాల్లో ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇవ్వాలన్న అధికారుల సూచనకు సీఎం అంగీకారం.
పసుపు, మొక్కజొన్నకు కనీస మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుండగా, పక్క రాష్ట్రాలలో ధరలు అమలు చేయకపోవడం అక్కడి నుంచి రైతులు ఆ పంటలు తీసుకువస్తున్నారు.  పక్క రాష్ట్రాల నుంచి పసుపు,మొక్కజొన్న తక్కువ ధరకే వస్తున్నాయన్న అధికారులు.  కరోనా సందర్భంలోనూ రాష్ట్రానికి చెందిన రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తుంటే, పక్క రాష్ట్రాల నుంచి పసుపు, మొక్కజొన్న వస్తే ఇక్కడి రైతులకు నష్టం కదా? అన్న ప్రస్తావన. అందువల్ల వాటిని నివారించాలన్న దానిపై చర్చ.

రైతు భరోసా సోషల్‌ ఆడిటింగ్‌ 

ఈనెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నామన్న అధికారులు.  ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి.  రైతు భరోసా పథకంలో మిగిలిపోయిన వారెవరైనా ఉంటే 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. 
ఆ మర్నాడు గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన.  అందువల్ల మిగిలిపోయిన వారెవరైనా ఉంటే, వారూ దరఖాస్తు చేసుకునేలా ప్రచారం చేయాలని సూచన.  ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు మండల వ్యవసాయ అధికారులు ఇచ్చే పాస్‌లు అనుమతించాలని అధికారులకు సీఎం సూచించారు. 

మార్కెట్లు:
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తెరుచుకుంటున్న దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడాలని ఆదేశాలు  మాస్కులు ధరించేలా అవగాహన  కలిగించాలన్నారు.  ఇప్పటికి 6 కోట్లకు పైగా మాస్క్‌లు పంపిణీచేసిన ప్రభుత్వం
ప్రతిరోజూ 42 లక్షల మాస్క్‌ల తయారీ కోసం ఆదేశం. 

 

ఫిషింగ్‌ హార్బర్లు:

రాష్ట్రంలో అదనంగా మరో ఫిషింగ్‌ హార్బర్, మరో 2 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు 
విజయనగరం జిల్లాలో ఒక ఫిషింగ్‌ హార్బర్‌కు సీఎం అనుమతి  దీంతో 9కి చేరనున్న ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం దీంతో పాటు విశాఖపట్నం జిల్లాలోని భీమిలి, నక్కపల్లిలో మరో 2 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.  దీంతో 3కు పెరిగిన కొత్త ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: