టీడీపీ నేతలకు అధికార దాహం ఇంకా తీరినట్లు కనిపించడం లేదు. గత ఐదేళ్లు అధికార పీఠంలో ఉండి , ఒక్కసారిగా దారుణంగా ఓడిపోయి అధికారం కోల్పోవడం టీడీపీ నేతలకు కష్టంగా ఉంది. భారీ మెజారిటీతో గెలిచి సీఎం జగన్ పాలన మొదలై సంవత్సరం కావొస్తున్న కూడా, టీడీపీ నేతలు ఇంకా తమ అధినేత చంద్రబాబు సీఎంగా ఉండుంటే ఇలా జరిగేది కాదంటూ డప్పు కొట్టడం మొదలు పెట్టారు.

 

కరోనా ప్రభావం మొదలైన దగ్గర నుంచి వారు ఇదే విధంగా మాట్లాడుతున్నారు. మా నాయకుడు ఉంటే కరోనాని ఒక వారంలో కంట్రోల్ చేస్తారని గొప్పలు చెబుతున్నారు. సరే నేతలు అన్నాక అధినాయకుడుకు డప్పులు కొట్టడం మామూలే. భవిష్యత్ లో ఏదొక పదవి ఇస్తారని అలా మాట్లాడతారు. కానీ టీడీపీ నేతలని మించి బాబు తనకు తానే డప్పు కొట్టడం మొదలుపెట్టారు. తాజాగా విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన సంచలన సృస్థించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనపై బాబు మాట్లాడుతూ... తానే గనుక సీఎంగా ఉండుంటే డైరక్ట్ గా గ్యాస్ కంపెనీకే వెళ్లి చర్యలు తీసుకొనేవాడిని అంటూ మాట్లాడారు.

 

అలాగే అవగాహనారాహిత్యం వల్ల ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకున్నారని సీఎం జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. ఇక టీడీపీ తరఫున చినరాజప్ప, అచ్చెన్నాయడు, రామానాయుడులతో కూడిన త్రిసభ్య కమిటీ ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించి వాస్తవాలు అధ్యయనం చేస్తుందని చెప్పారు. ఇక ఈ మాటలు బట్టి చూస్తే చంద్రబాబుకు మళ్ళీ సీఎం పీఠం కావాలని ఎంత తహతహలాడుతున్నారో తెలుస్తోంది. అయితే విశాఖ ఘటనపై సీఎం జగన్ వెంటనే స్పందించడం, బాధితులని పరామర్శించడం, ఎక్స్ గ్రేషియా ప్రకటించడం చేశారు.

 

చనిపోయిన వారికి కోటి, వెంటిలేటర్ పై ఉన్నవారికి 10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి లక్ష, కంపెనీ పరిధిలో ఉన్న కుటుంబాలకు రూ. 10 వేలు సాయం ప్రకటించడం, అలాగే దానికి ఎక్స్ గ్రేషియాకు సంబంధించిన నిధులని విడుదల చేయడం జరిగింది. అటు కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇలా జగన్ ఇంత చేసిన చంద్రబాబు మాత్రం తాను సీఎం అయితే ఇలా ఉండదు అంటూ డప్పు కొట్టుకునే ప్రయత్నం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: