తెలంగాణ లోని మహబూబ్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది.. పంచాయితీ కార్యదర్శి ఆత్మ హత్య కలకలం రేపుతుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. మహబూబ్‌నగర్‌లోని మర్లు ప్రాంతానికి చెందిన ఈదుల అరుణ్‌చంద్ర హన్వాడ మండలం యారోనిపల్లిలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంటి మేడపై పడుకున్న అరుణ్ గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కిందకు దిగి ఇంట్లోకి వెళ్లాడు. 

 

 

 

 

గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు..ఉదయం ఏడు గంటల సమయంలో కుటుంబసభ్యులు గదిలోకి వెళ్లి చూడగా అరుణ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యులతో పాటు స్థానికులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. తమ కుమారుడి ఆత్మహత్యకు యారోనిపల్లి సర్పంచి సుధారాణి, ఆమె భర్త అనంతరెడ్డి, వార్డు సభ్యుడు తిరుపతయ్య కారణమని మృతుడి తండ్రి వెంకటేశ్వర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడే. 

 

 

 

 

 

రిజర్వేషన్‌లో ఉద్యోగం సాధించి తమ ముందు విర్రవీగుతున్నావంటూ నోటికొచ్చినట్లు మాట్లాడటంతో పాటు విధులకు ఆటంకం కలిగించడంతో అరుణ్ మనస్తాపానికి గురయ్యాడని, అందువల్లే ఆరు రోజులుగా విధులకు హాజరు కాలేదని తెలిపారు..ఈ మేరకు మృతుడి తండ్రి పిర్యాదు  చేయడంతో తీసుకోవాలని వెంకటేశ్వర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై సర్పంచి సుధారాణి, ఆమె భర్త అనంతరెడ్డి స్పందిస్తూ... అరుణ్‌చంద్ర ఏప్రిల్‌ 24 నుంచి విధులకు రావడం లేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో మే 1న ఎంపీవోకు ఫిర్యాదు చేశామన్నారు. మే 2వ తేదీన పంచాయతీ కార్యాలయంలోని ఫైళ్లలో సూసైడ్ నోట్ కనిపించగా ఎంపీడీవోకు, ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో నే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: