తన పై దళితులు కేసు పెట్టారని ఓ వడ్డీ వ్యాపారి వారి ఇంటికి వెళ్లి మరీ ఇద్దరినీ దారుణంగా నరికి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ట్యుటికోరిన్ జిల్లాలోని ఉదయర్‌కులమ్ గ్రామానికి చెందిన పలవేశం అదే గ్రామానికి చెందిన షణ్ముగ సుందరం అనే వడ్డీ వ్యాపారి వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అందుకోసం తన ఇంటి పత్రాలను తనఖా పెట్టాడు. ఇటీవల తాను అప్పుగా తీసుకున్న డబ్బుని వడ్డీతో సహా చెల్లించిన పలవేశం ఇంటి పత్రాలు తిరిగివ్వాలని కోరాడు. అందుకు వడ్డీ వ్యాపారి షణ్ముగ సుందరం తిరస్కరించాడు.

 

 

 

 

 

 

దాంతో వారు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడని ఆగ్రహంతో రగిలిపోయిన అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఇంటికెళ్లి మరీ ఇద్దరు దళితులను నరికి చంపిన దారుణ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. దళితుల హత్యతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను భారీగా మోహరించారు. కుల ఘర్షణలకు దారినియ్యకుండ పోలీసులు ముందు జాగ్రత్తలు చేపట్టారు.. 

 

 

 

 

 

డబ్బులు చెల్లించిన కూడా చెల్లించలేదని అద్దం తిరిగాడు ఆ వడ్డీ వ్యాపారి.. ఇంటి పత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.. దాంతో తక్కువ కులం అంటూ సూచించారు.. అంతేకాకుండా నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు.. దాంతో ఆ బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశారు.. కులం తక్కువ చేసి మాట్లాడారని పిర్యాదు లో పేర్కొన్నారు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

 

 

 

 

 

 

షణ్ముగ సుందరం వర్గీయులు కూడా పలవేశంపై కౌంటర్ కేసు పెట్టారు. అయినప్పటికీ పలవేశంని అరెస్టు చేయలేదు. దీంతో రగిలిపోయిన సుందరం సామాజిక వర్గంవారు పలవేశంని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. షణ్ముగ సుందరం సోదరుడు, అతని అనుచరులు, పలువురు తేవర్ కులస్తులు పలవేశం ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న పలవేశం, అతని మేనల్లుడును అతి కిరాతకంగా నరికి చంపారు.. ప్రస్తుతం ఈ ఘటన దళిత సంఘాలను కదిలించి వేసింది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: