పరుగు ఆపడం ఒక కళ.. నిజంగా ఇది ఒక కళే.. ఏ రంగం నుంచైనా సరే.. విజయవంతంగా ఉన్నప్పుడే తప్పుకోవడం కూడా ఓ కళే.. ఉదాహరణకు నటుడు శోభన్ బాబును తీసుకుంటే.. ఆయన అందగాడుగా ఉన్నప్పుడే క్రమంగా సినిమా రంగం నుంచి తప్పుకున్నారు. తండ్రి పాత్రలు, తాత పాత్రలు వేసే అవకాశం ఉన్నా.. తెలుగు తెరకు ఆయన సోగ్గాడుగానే మిగలాలనుకున్నాడు.. ఆయన కన్నుమూసేవరకూ దాదాపు అలాగే మిగిలారు.

 

 

అలా ఓ రంగంలో ఆల్రెడీ పీక్స్ కు వెళ్లిన వారు స్వయం నియంత్రణ విధించుకోవడం చాలా కష్టం. చాలా మంది హీరోలు వయస్సు మళ్లినా తామే హీరోలమనుకుని.. ఫ్లాపుల మీద ఫ్లాపులిచ్చి మరీ దారుణ పరాజయాల తర్వాత నిష్క్రమిస్తారు. అలాంటి వారు కేరీర్‌లో బంపర్ హిట్లు ఇచ్చినా.. చివర్లో మిగుల్చుకున్న అపజయాలే ప్రేక్షకులకు గుర్తుంటాయి. చంద్రబాబు గురించి టైటిల్ పెట్టి సినిమా వాళ్ల సంగతెందుకు అంటారా. చంద్రబాబు పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే తయారయ్యింది.

 

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 9 ఏళ్లు.. విభజనానంతర ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా పని చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కుర్ర జగన్ చేతిలో ఘోర పరాజయం పొందారు. ఇక ఇప్పట్లో మళ్లీ విజయం దక్కుతుందన్న ఆశలు లేవు. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో ఆయన్ను మతి తప్పేలా చేస్తున్నాయి. రాజకీయాల్లో చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు ఇప్పుడు.. ఈయన చంద్రబాబే అని జనం అనుకునేలా ప్రవర్తిస్తున్నారు.

 

 

ఇందుకు తాజా ఉదాహరణ గ్యాస్ లీక్ ప్రమాదం.. ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబుకు ఏమైందని ఎవరికైనా అనుమానం రావడం సహజం. ‘ఐఏఎస్‌లు ఏం చేస్తారు..? ఎందుకు ఆ కమిటీ..? ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న నాకే స్టైరీన్ అంటే తెలియదు, ఐఏఎస్‌లకు ఏం తెలుస్తుంది..? అసలు జగన్‌ ఏం చేస్తున్నాడో తనకే అర్థం కావడం లేదు, చెబితే వినడు .. సబ్జెక్టు కమిటీ కదా వేయాల్సింది .. జగన్ ఎవరినీ అడగడు.. అందుకే మా నాయకులు రామానాయుడు, అచ్చెన్నాయుడు, చినరాజప్పలతో ఓ కమిటీ వేస్తున్నాను.. అంటూ ఆయన ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వం వేసిన కమిటీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. అందులోనూ ముగ్గురు ఇంజనీరింగ్ పట్టభద్రులు .. ఆ కమిటీని తప్పుబడుతున్న చంద్రబాబు.. తాను వేసిన కమిటీలో ఉన్న వారి అర్హతలేమిటి..? అంటే ఏం చెబుతారో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: