గత కొద్దీ రోజులుగా తెలంగాణ లో స్వల్పంగా కేసులు నమోదవుతుండగా శనివారం మాత్రం ఏకంగా 31 కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు. ఇందులో 30కేసులు జిహెచ్ఎంసీ లో నమోదుకాగా మరొకటి వలస కూలీ అని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈ 30 కేసుల్లో 26 కేసులు వనస్థలీపురం లోనే నమోదైనట్లు సమాచారం. ఇక తాజాగా నమోదైన కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య 1163 కు చేరింది అందులో 751 మంది కరోనా బాధితులు కోలుకోగా  30మంది మరణించారు. ప్రస్తుతం 382 కేసులు యాక్టీవ్ గా వున్నాయి. 
ఇక ఓవరాల్ గా ఇండియాలో ఈ ఒక్క రోజే 3000 కు పైగా కరోనా కేసులు నమోదయ్యినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా మహారాష్ట్ర లో 1165 ,ఢిల్లీ 224, తమిళనాడు లో 526 , గుజరాత్ లో 394 మధ్య ప్రదేశ్ 112 లు అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా దేశంలో ఇప్పటివరకు  60000 కేసులు నమోదు కాగా అందులో 18000 మంది కరోనా బాధితులు కోలుకోగా 2092 మంది మరణించారు. మరో ఎనిమిది రోజుల్లో మూడో దశ లాక్ డౌన్ కూడా ముగియనుంది. అప్పటివరకు కరోనా ప్రభావం తగ్గేట్లు లేకపోవడంతో మరోసారి లాక్ డౌన్ పొడిగించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. అయితే మూడో దశ లాక్ డౌన్ లో భారీగా సడలింపులు ఇవ్వగా నాలుగో దశలో  ప్రజా రవాణాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: