కొడాలి నాని.. జగన్ మంత్రి వర్గంలో కీలకశాఖ చూస్తున్న మంత్రి.. అయితే ఊర మాస్ లీడర్ అయిన నాని అచ్చమైన మాస్ భాష వాడతారు. మంత్రి హోదాలో ఉన్న విషయాన్ని కూడా ఇలాంటి విషయాల్లో పెద్దగా పట్టించుకోరు. అందులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నాయకులపై విమర్శల సమయంలో ఆటోమేటిగ్గా నాలుగు తిట్లు ఎక్కువగా పడిపోతుంటాయి.

 

 

ఆ విషయం మీ అమ్మా మొగుడు చెప్పాడా.. అన్నా.. టీడీపీ నాయకులు వట్టి చవటలు, సన్నాసులు, దద్దమ్మలు అన్నా.. ఆయనకే చెల్లుతుంది. అసలు టీడీపీ నాయకులను ప్రత్యేకించి చంద్రబాబు, లోకేశ్ వంటి వారిని తిట్టేందుకే కమ్మ వర్గానికి చెందిన కొడాలి నానికి జగన్ మంత్రి పదవి ఇచ్చారని వైసీపీ నాయకులు ఆరోపిస్తుంటారు. ఇక కొడాలి నాని మరోసారి చంద్రబాబు వ్యవహారశైలిపై మండిపడ్డారు.

 

 

గతంలో ఎన్నో బూతులు వినిపించిన కొడాలి నాని ఇప్పుడు మరో బూతు వాడారు. పదంలో పెద్దగా బూతు లేకపోయినా.. దాని అర్థం మాత్రం దారుణంగా ఉండే పదబంధం వాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “ చంద్రబాబులా తప్పుడు విధానాలతో నడివే వ్యక్తి కాదు వైయస్‌ జగన్‌.. ఆస్తులు పోయినా, ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చినా..కష్టాలు అనుభవించినా..ఇచ్చిన మాట కోసం మాట మీద, ప్రజల తరఫున నిలబడిన మగాడు వైయస్‌ జగన్‌. చంద్రబాబు మాదిరిగా అటు ఇటు కానోడు కాదు. అటు వెళ్తే వాళ్ల మాట..ఇటు వెళ్తే వీళ్ల మాటలు చెప్పి, అవసరం కోసం గోతులు తీసే రకం కాదు. వెన్నుపోటు పొడవడం వైయస్‌ జగన్, వైయస్‌ రాజశేఖరరెడ్డి రక్తంలో లేదు.. అంటూ మండిపడ్డారు కొడాలి నాని.

 

 

మాజీముఖ్యమంత్రిని పట్టుకుని అటూ ఇటూ కానివాడు అంటూ మండిపడటం కాస్త వివాదాస్పదం అయ్యేలా కనిపిస్తోంది. అయితే కొడాలి నాని వ్యవహారశైలి గురించి తెలిసిన వారు పెద్దగా ఇలాంటి తిట్లను పట్టించుకునే అవకాశం లేదు మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: