ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా వైసీపీ ని.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని తిట్టాలి కాబ‌ట్టి ఓ ప్రెస్ మీట్ పెట్టి తిడుతుంటారు. చంద్ర‌బాబ‌కు గ‌త యేగాది కాలంగా ఇదే అల‌వాటుగా మారింది. ఇక చంద్ర‌బాబుకు ప‌దే ప‌దే ప్రెస్ మీట్లు పెట్టే అల‌వాటు ఉంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే కొద్ది రోజులుగా ఏపీలో జ‌గ‌న్ తీసుకుంటోన్న నిర్ణ‌యాలు, సంస్క‌ర‌ణ‌లు చంద్ర‌బాబుకు ఎంత మాత్రం మాట్లాడే ప‌ని లేకుండా చేస్తున్నాయి. జ‌గ‌న్ అన్నా.. వైసీపీ అన్నా ఎప్పుడు ప‌డితే అప్పుడు ఏదో ఒక‌టి మాట్లాడేసి మీడియాలో నానాల‌నుకునే చంద్ర‌బాబు వారం రోజులుగా వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు రాజ‌కీయ‌, మీడియా వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. 

 

ఏపీలో సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తుతం కొత్త ఎత్తిపోతల పథకాన్ని తెర మీదకు తీసుకురావటం.. దీనిని పూర్తి చేయాల‌ని ఇప్ప‌టికే మంత్రుల‌కు చెప్పేశారు. దానిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా.. విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ‌కీయంగా ఇది రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మాంచి కాక అయితే రేపుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జ‌లాల‌ను రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించే ఈ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై అటు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ వాళ్లు కూడా గ‌ట్టిగానే విరుచుకు ప‌డుతున్నారు. ఇలాంటి కీల‌క‌మైన మ్యాట‌ర్ దొరికిన‌ప్పుడు జ‌గ‌న్‌పై .. ఏపీ ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డిపోయే చంద్ర‌బాబు చాలా మౌనంగా ఉన్నారు. అక్క‌డితో ఆగ‌కుండా త‌మ పార్టీ నేత‌ల‌ను కూడా కొద్ది రోజుల పాటు మౌన వ్ర‌తం ఆశ్ర‌యించ‌మ‌ని చెపుతున్నార‌ట‌.

 

ఈ విష‌యంలో మ‌నం ఏదైనా తొంద‌ర ప‌డితే ఇప్ప‌టికే తెలంగాణ లో పార్టీకి అతీ గ‌తీ లేద‌ని.. ఈ టైంలో మ‌నం ఎక్క‌డా తొంద‌ర ప‌డ‌కూడ‌ద‌ని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌ను దిశా నిర్దేశం చేశార‌ట‌. ఏదేమైనా చిన్న విష‌యానికి కూడా మ‌సిపూసి మారేడు కాయ చేసేసే చంద్ర‌బాబు ఈ విష‌యంలో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా వారం రోజులుగా మౌన మునిగా ఉండ‌డంతో పాటు పార్టీ నేత‌ల‌ను కూడా మాట్లాడ నీయ‌క పోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: