ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ తరుణంలోనే కరోనా పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక ఈ పరిస్థితిని కొందరు దుండగులు వారికి అనుగుణంగా మార్చుకొని ఇంట్లో ఉన్న సామాన్లను దొంగిలించుకుని వెళ్ళిపోయారు.. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... లాక్ డౌన్ సమయంలో కట్టుదిట్టమైన భద్రతను ఉన్నా కూడా తరచూ శాంతిభద్రతల సమస్య మాత్రం తీరటం లేదు.


మధ్యప్రదేశ్ లోని ఈ రోడ్డులో ఒక కుటుంబంలోని వారి ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఇక ఇలా ఆసరాగా తీసుకున్న దుండగులు వారి ఇంట్లోకి చొరబడి ఇల్లు గుల్ల చేశారు. నిజానికి కుటుంబంలో ఒకరికి పాజిటివ్ రావడంతో ఏప్రిల్ 6న ఆ కుటుంబం మొత్తం క్వారంటైన్ కు తరలించడం జరిగింది. క్వారంటైన్ లోని వారు ఉంటున్న ఇంట్లోకి దొంగలు చొరబడి విలువైన వస్తువులను దొంగతనం చేశారు. ఇక క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఉండే విలువైన వస్తువులు కనపడలేదు.


దీనితో వారికి ఇంట్లో దొంగలు పడ్డారని అర్థమయింది. ఈ సంఘటనపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక పోలీసు అధికారులు దర్యాప్తు సరిగ్గా కొనసాగించడంలేదని ఆ కుటుంబ సభ్యులు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఫిర్యాదు చేయడం జరిగింది. మేము పోలీసులకు ఫిర్యాదు చేశాను కానీ దర్యాప్తులో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని బాధితులు పేర్కొన్నారు. ఇందంతా ఇలా ఉండగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే క్వారంటైన్ కేంద్రం నుంచి తిరిగి వచ్చిన వారికి.. తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించగా కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో మళ్లీ వారిని ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: