గత కొద్దీ రోజుల నుండి కేరళలో భారీగా కేసులు నమోదవుతున్నాయి అటు విదేశాల నుండి అలాగే ఇతర రాష్ట్రాల నుండి స్వస్థలాకు వస్తున్న వారి వల్ల అక్కడ  కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇక ఈరోజు కొత్తగా మరో 16 కేసులు నమోదు అయ్యాయని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అందులో 13 విదేశాల నుండి వచ్చినవి కాగా మరో మూడు కాంటాక్ట్ కేసులు. ఈ కొత్త కేసులతో కలిపి కేరళలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 576కు చేరింది. అందులో ప్రస్తుతం 80కేసులు యాక్టీవ్ గా ఉండగా ముగ్గురు మరణించారు. 493 మంది బాధితులు కోలుకున్నారు. 
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే  తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. ఈరోజు కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి అంతేకాదు 5గురు మరణించారు అలాగే కర్ణాటక లో ఈరోజు 45 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈరోజు మరో 57 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 2157కు చేరింది. ఇవికాకుండా మరో 150 కేసులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చాయి. ఇక ఈరోజు తెలంగాణలో కొత్తగా 40కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది కాగా గత కొన్ని రోజుల నుండి  తెలంగాణ లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: