చంద్రబాబును కేసీఆర్ ఘోరంగా డిజప్పాయింట్ చేశారా... కేసీఆర్ నుంచి చాలా ఆశించిన చంద్రబాబు.. ఆ కోరిక నెరవేరకపోవడంతో బాగా నిరుత్సాహపడిపోయారా.. అవునంటున్నారు వైసీపీ నాయకులు. అసలు చంద్రబాబు ఎందుకు కేసీఆర్ మీద ఆశలు పెట్టుకుంటారు.. ఏ అంశంలో చంద్రబాబు కేసీఆర్ వైపు చూస్తారు.. కేసీఆర్ ఏం చెబితే చంద్రబాబు అంతగా డిజప్పాయింట్ అయ్యారు.. అంటారా..?

 

 

అదే ఇంట్రస్టింగ్ పాయింట్... ఇప్పుడు మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయితీలు ప్రారంభమయ్యాయి కదా.. రాయలసీమకు నీటి కోసం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచే విషయంపై మాటల యుద్ధం మొదలైంది కదా. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతోనే రాయలసీమకు నీటి కష్టాలు పోతాయని ఏపీ సీఎం జగన్ అంటున్నారు. మాకు చెప్పకుండా ఎలా చేస్తున్నారని కేసీఆర్ అంటున్నారు. ఈ విషయంలో ఇద్దరికీ బేధాభిప్రాయాలు వచ్చాయి.

 

 

ఈ నేపథ్యంలో అటు కేసీఆర్ కానీ.. ఇటు జగన్ కానీ ఈ విబేధాలపై నేరుగా స్పందించలేదు. అయితే సోమవారం ప్రెస్ మీట్ సందర్భంగా.. కేసీఆర్ జగన్ తీరుపై మండిపడతారని మాజీ సీఎం చంద్రబాబు చాలా ఊహించారట. అదే జరిగితే దాన్ని రాజకీయంగా వాడుకోవాలని ఎంతగానో ప్లాన్ చేసుకున్నారట. కానీ.. ఇంత చేసినా కేసీఆర్ పెద్దగా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడింది ఏమీ లేదు. పైగా.. మా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు.

 

 

దీంతో చంద్రబాబు చాలా డిజప్పాయింట్ అయ్యారని వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ జగన్ ను ఏమైనా అంటారేమోనని తెలుగుదేశం అనుకూల మీడియా వారం రోజులపాటు ఎదురు చూసిందని... ఎడిటోరియల్స్, కాంగ్రెస్ వాళ్లని రెచ్చగొట్టడాలు, టీవీల్లో జలజగడాలంటూ తగాదా పెట్టే చర్చలు అన్నీ నీరు కారిపోయాయని అంటున్నారు. అంతే కాదు.. కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఏదో అంటారని టీడీపీ నేతలు ఆశపడి భంగపడ్డారని చెబుతున్నారు. చివరకు బాబు కూడా కేసీఆర్ లైవ్ చూశాడని... కళ్లు మండుతున్నాయా అని కేసీఆర్ అన్నది చంద్రబాబునే అని సెటైర్లు పేలుస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: