గత నాలుగు రోజుల నుంచి భారత్ లో 5000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నా ఆ ప్రయోగాలు సక్సెస్ అవుతాయో లేదో ఎవరూ చెప్పలేరు. పలువురు శాస్త్రవేత్తలు ఇప్పటికే వాళ్లు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కరోనాను కట్టడి చేయలేకపోయిందని చెబుతున్నారు. 
 
ప్రముఖ రాజకీయ నాయకులు కరోనాతో కలిసి జీవించాల్సిందేనని పలు సందర్భాల్లో చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనాతో కలిసి జీవించాల్సిందేనని చెబుతున్నారు. కేంద్రం లాక్ డౌన్ ద్వారా కరోనాను కట్టడి చేద్దామని భావించినా ఢిల్లీ మర్కజ్ వల్ల, ఇతర కారణాల వల్ల దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. వృద్ధులు, చిన్నారులు ఇంటికే పరిమితం కావాలని కేంద్రం చెబుతోంది. 
 
మరోవైపు దేశంలో ఆత్మహత్యల రేటు అంతకంతకూ పెరుగుతోంది. పిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులకు వేతనాలు సరిగ్గా అందడం లేదు. దేశంలో క్రైమ్ రేటు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇతర వ్యాధులతో బాధ పడుతున్నవారు ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారు. కరోనా విజృంభణ వల్ల మానవుల జీవన శైలి కూడా మారిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
శాస్త్రవేత్తలు మాత్రం చేస్తున్న ప్రయోగాల్లో ఏదో ఒక ప్రయోగం సక్సెస్ అయినా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనాను నిర్మూలించడం సాధ్యమే అని చెబుతున్నారు. కానీ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేమని అంటున్నారు. తాజాగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భవిష్యత్తులో కరోనా సోకని మనిషి ఉండడేమో అని వ్యాఖ్యలు చేశారు. ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అవుతారో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: