దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. గత మూడు రోజుల నుంచి దేశంలో ప్రతిరోజూ ఆరు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,30,000 దాటగా కరోనా మృతుల సంఖ్య 4,000కు చేరువలో ఉంది. కేంద్రం రెండు నెలల క్రితం మార్చి నెల 24వ తేదీన లాక్ డౌన్ ను ప్రకటించింది. ఆ తరువాత కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తూ వచ్చింది. 
 
తొలి విడత, రెండో విడతలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసిన కేంద్రం మూడో విడత లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడం ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో మూడో విడత లాక్ డౌన్ లో మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఆరెంజ్, గ్రీన్ జోన్లలో నిబంధనలు సడలించింది. నాలుగో విడత లాక్ డౌన్ లో కేంద్రం భారీగా సడలింపులు ఇచ్చింది. 
 
నాలుగో విడత లాక్ డౌన్ లో కేంద్రం రాష్ట్రాలకు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఇచ్చింది. పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతులు ఇవ్వడంతో పాటు తాజాగా దేశీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1వ తేదీ నుంచి 200 రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తున్నా లాక్ డౌన్ లాక్ డౌన్ కు నిబంధనలను భారీగా సడలిస్తోంది. 
 
ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాలలో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కొందరు లాక్ డౌన్ నిబంధనలను సరిగ్గా పాటిస్తున్నా పాటించని వారి వల్ల వీరు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు లాక్ డౌన్ సడలింపుల తరువాత కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొందరిలో కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో వారు వైరస్ వ్యాప్తి కావడానికి కారణమవుతున్నారు. అయితే కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తుందా...? లేక లాక్ డౌన్ ను ఎత్తేసి మరో విధంగా ముందుకెళ్లనుందా...? చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: