చైనా లద్దాక్ సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సిక్కిం అంతర్జాతీయ సరిహద్దు దగ్గర సైనిక బలగాలను మోహరించింది. మన దేశం కూడా అక్కడ సైనిక బలగాలను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని మోదీ నిన్న సాయంత్రం దిశ సరిహద్దుల్లో తాజా పరిస్థితుల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. సరిహద్దుల్లోని పరిస్థితుల గురించి ఆరా తీశారు. 
 
జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, త్రివిధ దళాల ప్రధానాధికారి (సీడీఎస్) బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధిపతులతో మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మోదీ విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ తో మాట్లాడారు. భారత్ ను ఏదో ఒక విధంగా అతలాకుతలం చేయాలని చైనా సరిహద్దు ప్రాంతాల దగ్గర సైన్యాన్ని రంగలోకి దింపుతోంది. సముద్రాలపై ఆధిపత్యం చెలాయించటం ప్రపంచ దేశాల వల్ల కాకపోయినా భారత్ ను ముందు ఉంచి ప్రపంచ దేశాలు నడిపిస్తాయని చైనా భయపడుతోంది. 
 
దీంతో భారత్ ను దెబ్బ కొట్టడానికి ఒక కుట్ర పన్నుతోంది. ఇక్కడ మలక్కా జల సంధి, సుంధా జల సంధి గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. చైనా దిగుమతులలో 70 శాతం మలక్కా జల సంధి ద్వారా జరుగుతుండగా చైనాను కౌంటర్ చేయడానికి అండమాన్ నికోబార్ దీవులలో భారత్ భారీ స్థావరాలను నిర్మించుకుంది. అండమాన్ నికోబార్ దీవుల దగ్గర భారత్, ఆస్ట్రేలియా కలిసి పని చేస్తున్నాయి. 
 
మలక్కా జల సంధికి అవరోధాలు కల్పిస్తే చైనా ప్రత్యామ్నాయంగా సుంధా జల సంధిని ఉపయోగించనుంది. ఈ సుంధా జల సంధి నుంచి ఆఫ్రికాకు చైనా నౌకలు సులభంగా వెళ్లగలవు. అయితే ఆస్ట్రేలియాకు సంబంధించిన కోకోస్ ఐలాండ్స్ లో భారత్, ఆస్ట్రేలియా కలిసి పని చేయనున్నాయి. దీనికి సంబంధించిన ఒప్పందం జులైలో కుదరనుండటంతో చైనా ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది. మోదీ చైనాకు కోకోస్ ఐలాండ్స్ ద్వారా చెక్ పెట్టడంతో ఏం చేయాలో పాలుపోని డ్రాగన్ దేశం సరిహద్దు దగ్గర సైన్యాన్ని దింపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: