ఏ దేశానికి అయినా సరిహద్దు రాష్ట్రాలు ఎంతో ముఖ్యమైనవి. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు దేశభక్తి ఎంతో అవసరం. లేకపోతే శత్రువులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల మానసిక స్థైర్యం, దేశభక్తి దేశాన్ని కాపాడతాయి. సైనికులు సరిహద్దుల్లో ఉన్నా లేకపోయినా శత్రువులు దాడి చేస్తే పోరాడాల్సింది సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రమే. 
 
ఈశాన్య రాష్ట్రాలైనా, బెంగాల్ అయినా, పంజాబ్ సైనికులకు సరిహద్దు ప్రాంతాల ప్రజల సహకారం ఎంతో ముఖ్యం. అయితే ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై దేశంలోని పలు ప్రాంతాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు భారత్ లో భాగం కాదని... వీరు మంగోలియా నుంచి భారత్ కు వచ్చారని... వారిని ఒక రకంగా మన దేశంలోని ప్రజలే వేరుగా చూడటం జరిగింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో ఇదే పరిస్థితి నెలకొంది. 
 
భారత్ లో ఈశాన్య రాష్ట్రాలను ప్రత్యేకంగా చూడటంతో ఆ దేశాల్లో ఇతర దేశాలకు చెందిన మతాల పజలు ప్రవేశించి వేరే మతంలోకి మారేలా చేశారు. ప్రస్తుతం డ్రాగన్ దేశం కూడా ఈశాన్య రాష్ట్రాలను అడ్డు పెట్టుకొని భారత్ ను దెబ్బ తీయాలని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బెంగాల్ లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. అయితే బెంగాల్ లోకి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వ్యాపారులు లోకల్ గా వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలను కొల్లగొట్టారు. 
 
బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ కు వచ్చిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓటు హక్కు ఇచ్చి ఇతర సదుపాయాలు కల్పించింది. ఇప్పుడు దేశంలో ఈ కారణాల వల్ల నాగాలాండ్, బెంగాల్ రాష్ట్రాలు టెన్షన్ పెడుతున్నాయి. ఇతర దేశాలు ఈ రాష్ట్రాల ద్వారా భారత్ ను దెబ్బ తీయాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. సరిహద్దు ప్రాంతాల ప్రజల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానసికంగా వారు ఈ దేశ పౌరులనే భావం పెంపొందించడంతో పాటు వారిలో దేశభక్తి పెంపొందించటానికి కూడా  కృషి చేయాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: