నారా లోకేశ్.. పాపం కాలం కలసిరాని నేతల్లో నారా లోకేశ్ ఒకరుగా చెప్పుకోవాలి. ఎన్టీఆర్ మనవడు.. బాలయ్య అల్లుడు, చంద్రబాబు కొడుకు.. ఇన్ని అర్హతలు ఉన్నా.. రాజకీయంగా మాత్రం ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాడు.

 

 

ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడా గెలవకపోయినా ఏకంగా మంత్రి అయిపోయిన నారా లోకేశ్ కు ఇప్పుడు రాజకీయంగా కష్టకాలంగానే చెప్పుకోవాలి. ఈ మధ్య లోకేశ్ పెద్దగా బయట కనిపించడం లేదు. మొన్నటికి మొన్న ఓ రెండు నెలలు లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. అప్పుడప్పుడు తన కుమారుడు దేవాన్ష్ తో కలసి హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతూ ఫోటోల్లో కనిపించడమే తప్ప.. హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు పెద్దగా బయటకు రాలేదు.

 

 

ఇప్పుడు ఏపీకి వచ్చినా నారా లోకేశ్ ప్రజా కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు కూడా. ఇటీవల మహనాడు సందర్భంగా అమరావతిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన నారా లోకేశ్ ఆ తర్వాత మళ్లీ బయటకనిపించ లేదు. అయితే ఆయన రాజకీయాల్లో అంతగా యాక్టివ్ గా లేకపోయినా.. వైసీపీ నేతలు మాత్రం ఆయన్ను టార్గెట్ చేయడం మానడం లేదు.

 

 

తాజాగా.. లోకేష్‌ మొదటి షోకే వెనక్కి వెళ్లిపోయే ఫ్లాప్‌ సినిమా లాంటోడని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త ఘాటుగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడాలి.. మరి ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారో లేదో..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: