కరోనా ప్రపంచంలో అన్ని రంగాలనూ కుదేలు చేసింది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలనూ కుప్పకూల్చింది. బడాబడా పారిశ్రామికవేత్తలు సైతం వందల కోట్లు నష్టపోయారు. అయితే కొందరు గడుసుగాళ్లు మాత్రం ఈ టైమ్‌లో గతంలో కన్నా ఎక్కువ సంపాదించారు. కొత్త రికార్డులు సృష్టించేశారు. వాళ్లెవరో తెలుసుకుందామా..?

 

 

కరోనా కారణంగా ప్రపంచమంతా లాక్ డౌన్ అమలు చేశారు. చాలా దేశాలు ఈ లాక్ డౌన్ విధించాయి. దీని కారణంగా అత్యవసర సరుకుల కోసం జనం ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో ఈ కామర్స్ బిజినెస్ బాగా పుంజుకుంది. ఇందుకు అమెజాన్ కంపెనీ ఆదాయం పెరిగిన తీరే ఓ ఉదాహరణ. అమెజాన్‌ సేవలు కరోనా తర్వాత అత్యవసరం అయ్యాయి. అందుకే ఈ కంపెనీ ఆదాయం గణనీయంగా పెరిగింది.

 

 

మార్చి నాటి కనిష్ఠాల నుంచి అమెజాన్‌ షేరు ఏకంగా 47 శాతం పెరిగింది. దీంతో అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ నికర విలువ మార్చి 18తో పోలిస్తే 36.2 బిలియన్‌ డాలర్లు ఎక్కువగా పెరిగింది. ఇక కరోనా సమయంలో జనం ఎక్కువగా ఇళ్లలోనే ఉండిపోయారు. టైంపాస్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయించారు. ఆ కారణంగా ఫేస్ బుక్ కూడా గణనీయంగా లాభపడింది.

 

 

స్టాక్ మార్కెట్ లో ఫేస్‌బుక్‌ షేరు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ కంపెనీ ఫేస్ బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద మార్చి 18తో పోలిస్తే 30.1 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఇంకా అమెజాన్, ఫేస్ బుక్ లతో పాటు అనేక నెట్ ఆధారిత సేవల కంపెనీలు కోట్లు గడించాయి. కరోనా టైమ్ కంటే ఎక్కువగా ఆదాయం సంపాదించాయి. టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌, గూగుల్‌ అధిపతి సెర్గీ బ్రిన్‌, లారీ పేజ్‌; మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈఓ స్టీవ్‌ బామర్‌ ఒక్కొక్కరు 13 బిలియన్‌ డాలర్లు లేదా అంత కంటే ఎక్కువే సంపాదించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: