దేశంలో రోజు రోజుకీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఓ వైపు లాక్ డౌన్ పాటిస్తున్నా.. కరోనా బాధితులను క్వారంటైన్ లో ఉంచినా.. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా ఈ వ్యాధి ప్రబలిపోతూనే ఉంది.  తాజాగా ఓ కుక్కను క్వారంటైన్ లో ఉంచారు.  మనుషులతో పాటు అది కూడా  నిర్భందంలోకి వెళ్లాల్సి వచ్చింది. జమ్మూ కశ్మీర్‌లో ఇది జరిగింది. అయితే కుక్కను క్వారంటైన్ చేయడం వెనక ఓ కారణం కూడా ఉందని అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. తకురాయ్‌ గ్రామానికి చెందిన ఓ డ్రైవర్‌కు ఇటీవల కరోనా లక్షణాలు బయటపడ్డాయి.  అయితే వెంటనే ఆయన్ని ఐసోలేషన్‌ వార్డు కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

 

అయితే ఆయనకు తన పెంపుడు కుక్క అంటే ఎంతో ప్రాణం అని.. అది తాను లేకుండా ఉండలేదని అక్కడి వైద్యాధికారులకు విన్నవించుకున్నారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో దీనిపై సాధ్యాసాద్యాలు పరిశీలించి అనుమతి ఇచ్చారు. దీంతో తన వెంట దాన్ని తీసుకెళ్లి ప్రతి రోజు దాని యోగక్షేమాలు చూసుకుంటూ.. క్వారంటైన్‌లో ఉంటున్నారు.

 

 

గత రెండు నెలలుగా లాక్ డౌన్ కారణంగా మనం సాదుకుంటున్న మూగ జీవాల పరిస్థితి ఓ మాధిరిగా ఉన్న బయట తిరుగుతున్న కుక్కలు, పిల్లులు ఇతర పశు పక్షాదుల పరిస్థితి దారుణంగా తయారైంది.. రోడ్లపై ఎన్నో జీవులు చనిపోయాయి.  ఇక కృర మృగాలైతే జనావాసాల్లోకే రావడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.  దానికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: