గత నెల రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తూ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. చైనాకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో భారత్ ఆస్ట్రేలియాతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. సాధారణంగా చైనా హిందూ మహాసముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం గుండా మూడు మార్గాల జల సంధులను ఆయిల్ రవాణా కోసం వినియోగిస్తోంది. మలక్కా జలసంధి, సుందా జలసంధి, లంబార్గ్ జలసంధుల ద్వారా ఆయిల్ రవాణా జరుగుతోంది. 
 
ఈ మూడు జలసంధులలో మలక్కా జలసంధి చైనాకు అతి ముఖ్యమైనది. 80 శాతం రవాణా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. మన దేశంలోని అండమాన్ నికోబార్ దీవుల నుంచి మలక్కా జలసంధి ద్వారా చైనా ఆయిల్ రవాణా జరగకుండా కట్టడి చేసే అవకాశం ఉంది. అలా చేస్తే చైనా సుంధా, లంబార్గ్ జలసంధుల ద్వారా ఆయిల్ రవాణా చేయడానికి చైనా ప్రయత్నిస్తుంది. ఆ రెండు మార్గాలపై భారత్ పట్టు సాధించాల్సి ఉంది. 
 
ఈ రెండు మార్గాలపై పట్టు సాధించడం కోసం భారత్ ఆస్ట్రేలియాతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. మ్యూచువల్ లాజిస్టిక్స్ సర్వీస్ అగ్రిమెంట్ పేరుతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఆస్ట్రేలియాలోని కోకోస్ ఐల్యాండ్స్ లో భారత్ ఆర్మీ బేస్ లను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ఆర్మీ బేస్ లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా చైనా సుందా, లంబార్క్ జలసంధుల ద్వారా ఆయిల్ రవాణా చేయకుండా చేయవచ్చు. 
 
మిగతా రెండు మార్గాలను కూడా కట్టడి చేయడం ద్వారా వ్యూహాత్మకంగా చైనాకు చెక్ పెట్టాలని భారత్ భావిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ సొంతమైతే చైనా పాకిస్తాన్ మధ్య వన్ రోడ్ వే ప్రాజెక్ట్ కూడా ఆగిపోతుంది. ఈ విధంగా చేస్తే చైనాకు భారత్ కు అన్ని వైపులా చెక్ పెట్టినట్టు అవుతుంది. చైనా మన చుట్టూ శ్రీలంక, బర్మా, నేపా, పాక్ దేశాలను రెచ్చగొడుతోంది. భారత్ ఈ విధంగా చేయడం ద్వారా చైనాను పరోక్షంగా హెచ్చరిస్తోంది. చైనా విషయంలో మోదీ అనుసరిస్తున్న ఈ వ్యూహం మేధావులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: