ఈ మధ్య కొందరు వ్యక్తులు తమ రక్షణ కోసం, లేకుంటే ఏదో ఒక విధంగా తుపాకీని కలిగి ఉండడం సర్వసాధారణం అయిపోతుంది. అది వారి అవసరాల వరకు ఉపయోగిస్తే బాగా ఉంటుంది. అలా కాదని రోడ్డు మీదకు తీసుకువచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు చేస్తే ఎంత వరకు సమంజసమో అర్థం చేసుకోవాలి. అయితే అసలు విషయంలోకి వెళితే... మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ వ్యక్తి తుపాకిని తీసుకుని నడిరోడ్డుపై హల్ చల్ చేశాడు. తుపాకీ పట్టుకొని నడిరోడ్డు పై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు సదరు వ్యక్తి. మాదాపూర్ ప్రాంతంలో ఉన్న మస్తాన్ నగర్ బస్తీ ఏరియాలో మంగళవారం నాడు రాత్రి కూడా ఓ వ్యక్తి కారులో నుంచి దిగాడు. అయితే అతని చేతిలో తుపాకీ పట్టుకుని రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ ఫోన్ లో సంభాషణ చేస్తున్నాడు. అంతే కాకుండా తన కారుని రోడ్డుకు అడ్డంగా నిలిపివేశాడు. దీనితో ఆ ప్రాంతంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 


ఈ సమయంలో కొందరు వాహనదారులు అక్కడ ఉన్న స్థానికులు అతన్ని నిలదీశారు. దీనితో కోపం తెచ్చుకున్న ఆ వ్యక్తి తుపాకీ చూపిస్తూ చంపేస్తాను అంటూ బెదిరించాడు. అంతేకాకుండా తాను ఒక అధికార పార్టీకి చెందిన వ్యక్తిని ఎవరైనా నాకు ఎదురు తిరిగితే ప్రాణాలు తీసేస్తా అంటూ కొద్దిసేపు నానా హైరానా చేసేసాడు. ఇక అక్కడ ఉన్న స్థానికులు అతడి మాటలకు కోపంతో అతనిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా అతడు కారులో ఎక్కి అక్కడి నుంచి పరారయ్యాడు.

 


దీనిపై సమాచారం అందుకున్న మాదాపూర్ ఏరియా పోలీసులు సదరు ప్రాంతానికి చేరుకొని అక్కడ అ వ్యక్తులతో వివరాలు సేకరించారు. అతడి కారుపై మెంబర్ అఫ్ పార్లమెంట్ అని కూడా రాసి ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలియజేస్తున్నారు. అయితే వారు అందించిన కారు నెంబర్ ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాల కొరకు దర్యాప్తు ప్రారంభించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: