తెలంగాణ ఇప్పుడు ప్రగతి పథంలో నడుస్తుంది.. ఎంత మంది ప్రతిపక్ష నేతలు వచ్చి విమర్శించిన ప్రజల నమ్మకం ఎప్పుడూ టీఆర్ఎస్ పైనే ఉంటుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చూసి ప్రతి పక్ష నేతలకు ఏక్కడ ఏం విమర్శించాలో పాలుపోని పరిస్థితి అందుకే అధికార పార్టీపై లేని పోని విమర్శలు చేస్తున్నారని అన్నారు మంత్రి కేటీఆర్.  టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు నక్కలన్నీ కలిసి సంతాప సభ పెట్టినట్టుందని ఆయన ఎద్దేవా చేశారు.  పాలన బాగాలేకుండా మీకన్నా ముందు ప్రజలే ప్రశ్నిస్తారు.. అందుకే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పనులు సమర్థవంతంగా చేపడుతున్నారు. 

 

కాంగ్రెస్ నేతలు జల దీక్షలు చేయడంలో ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. ఎన్నో ఏళ్లు పాలించి కాంగ్రెస్ నేతలు చేసిందేముందని... అసలు వాళ్లకు సిగ్గుందా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచించింది.. నీటి విలువ తెలిసి ఆ నీరు ఎలా తెచ్చుకోవాలో ప్రయత్నాలు మొదలు పెట్టింది.. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని అన్నారు.

 

రైతులను రాబందుల్లా పీక్కుతిన్న చరిత్ర కాంగ్రెస్ నాయకులదని అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. గోదావరి నీటితో చెరువులు కళకళలాడుతున్నాయని చెప్పారు. కేసీఆర్ పాలన చూసి కాంగ్రెస్ నేతలు ఈర్ష్య పడుతున్నారని, వారి కళ్లు ఎర్రబడుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఆరేళ్లలో కేసీఆర్ ఏం చేశారో కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: