టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారు. అలాగే ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్‌కు మద్ధతు తెలిపారు. ఇక ఇటీవల మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారని వార్తలు వచ్చాయి గానీ...వాళ్ళు పార్టీ మారలేదు. అయితే తాజాగా మాత్రం మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీ కండువా కప్పుకుని బాబుకు భారీ షాక్ ఇచ్చారు.

 

ఈ క్రమంలోనే బాబుకు మరో షాక్ కూడా రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. అది కూడా టీడీపీ కంచుకోటలోనే ఎమ్మెల్యే జంప్ అయిపోవడానికి సిద్ధమవుతున్నారని టాక్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. టీడీపీ ఆవిర్భావం నుంచి 1983, 1985,1989,1994,1999, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఉండిలో టీడీపీనే గెలిచింది. ఒక్క 2004లో మాత్రం ఓటమి పాలైంది.

 

అయితే ఈ కంచుకోట ఇప్పుడు బద్దలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు(కలవపూడి రాంబాబు) జగన్‌కు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈయన వైసీపీ వైపు వెళ్లడానికి పలు కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. వ్యాపార వ్యవహారాలతో పాటు, వచ్చే ఎన్నికల్లో టీడీపీలో సీటు దక్కే అవకాశం తక్కువ ఉండటంతో వైసీపీ వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

 

వచ్చే  ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ సీటు మళ్ళీ రామరాజు సోదరుడు వరుసయ్యే వేటుకూరి శివరామరాజు(కలవపూడి శివ)కు ఇచ్చే ఛాన్స్ ఉంది. శివ 2009, 2014లలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం బాబు...శివని నరసాపురం ఎంపీగా నిలబెట్టారు. ఇక శివ ఎంపీగా ఓడిపోయి, ప్రస్తుతం సైలెంట్‌గా ఉంటూ...నెక్స్ట్ తన నియోజకవర్గానికి తిరిగొచ్చేయాలని చూస్తున్నారు.

 

శివ తిరిగొస్తే రామరాజుకు టిక్కెట్ దక్కదు. అదే వైసీపీలోకి వెళితే.. ఈ నాలుగేళ్ళు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్  టిక్కెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ ఇన్‌చార్జ్ పి‌వి‌ఎల్ నరసింహరాజు వీక్‌గా ఉండటం వల్ల, రామరాజుకు వైసీపీ టిక్కెట్ దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలో రామరాజు..త్వరలోనే టీడీపీని వీడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: