కరోనా వలన ఉద్యోగులకు వర్క్ ఫ్రొమ్ హోమ్ ఇచ్చారు. కంపెనీ లో ఉన్నపుడు వారికీ ఒక్కసారి మీటింగ్స్ పెట్టుకొని కంపెనీ గురించి మాట్లేడేకున్నారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ‘స్మార్ట్‌ మీటింగ్స్‌' తెరపైకి తీసుకువచ్చారు. ఏమైనా కీలక సమావేశాలు కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తూ కరోనా కట్టడికి కృషి కంపెనీలు చేస్తున్నాయి.

 

 

ఒకప్పుడు పెద్ద కంపెనీల మీటింగ్‌ నిర్వహణ అంటే హోటళ్లు, రెస్టారెంట్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌, కాలేజీ బిల్డింగ్స్‌ వేదికగా వందలాది మందితో జరుగుతుండేవి. విదేశాల, రాష్ట్రాల నుంచి కంపెనీల ప్రతినిధులు హాజరయ్యేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. అన్నీ సమావేశాలు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. అందుకు అనుగుణంగా అనేక రకాల యాప్‌లు అందుబాటులో తీసుకొచ్చారు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్వహించే కంపెనీల మీటింగ్‌లు ఇప్పుడు కొద్దిపాటి ఖర్చుతో ముగుస్తున్నాయి. చివరికి రాజకీయ సభలు సైతం ‘స్మార్ట్‌'గా నిర్వహిస్తున్నారు.

 

 

మీటింగ్‌కు హాజరుకావడానికి ఎక్కడెక్కడి నుంచో కంపెనీ ప్రతినిధులు రావాల్సి ఉండేది. రెండు, మూడు రోజులు ఇక్కడే విడిది చేయాల్సి వచ్చేదన్నారు. స్మార్ట్‌ సమావేశాలు ఆ బాధ నుంచి ఉపశమనం కలిగించాయనే చెప్తున్నారు. 

 

 

బోర్డు మీటింగ్‌ ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసుకున్న సమయంలో కీలక నిర్ణయాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందన్నారు. క్వాలిటీ నెట్‌వర్క్‌ సదుపాయం లేక సమావేశం నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. 60  నుంచి 70 శాతం వరకు స్మార్ట్‌ సమావేశాలు మంచిగా ఉన్నాయి. స్క్రీన్‌ షేరిం గ్‌, రికార్డింగ్‌ సదుపాయం ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్‌లో సందేహాలు తీర్చే వెసులుబాటు లేదని నిపుణులు చెబుతున్నారు.

 

 

గంట పాటు జరిగే సమావేశానికి మొబైల్‌ డేటా సరిపోదంటున్నారు. పట్టణాలు, నగరాల్లో క్వాలిటీ నెట్‌వర్క్‌ ఉందన్నారు. కొన్ని యాప్‌ల్లో హ్యాకర్స్‌ సులభంగా ప్రవేశించి హ్యాక్‌ చేసే ప్రమాదముంది అంటున్నారు నిపుణులు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కాకపోతే . సెక్యూరిటీ సెట్టింగ్స్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆన్‌లైన్‌ కాన్ఫరెన్స్‌లో తెలియని వారితో ఫోన్‌ నంబర్లు షేర్‌ చేయకూడదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: