రాష్ట్రంలో సీఎం జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తైంది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పార్టీకి ఆ పార్టీ బలాలను, బలహీనతలను అంచనా వేసుకుంటాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాయి. తెలుగుదేశం సొంతంగా వేసుకున్న అంచనాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో తమ పార్టీకి 55 శాతం ఓట్లు వస్తాయని చెబుతోంది. 
 
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 95 నుంచి 105 సీట్లు వస్తాయని టీడీపీ చెబుతోంది. ఏపీ టుడే సర్వే ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీకి 2019 ఎన్నికల్లో 51 శాతం ఓట్లు రాగా ప్రస్తుతం ఆ శాతం 45కు పడిపోయిందని... బీజేపీ - జనసేన కూటమికి ప్రజల మద్దతు 25 శాతంకు పెరిగిందని.... టీడీపీకి కూడా రాష్ట్రంలో ప్రజల మద్దతు 26 శాతానికి పడిపోయిందని... గతంతో పోలిస్తే 13 శాతం ప్రజల మద్ధతు తగ్గిందని సర్వేలు చెబుతున్నాయి. 
 
రాష్ట్రంలో బీజేపీ జనసేన కూటమి కీలకమైన శక్తిగా ఎదగనుందని.... కాపులు, ఇతర అగ్రవర్ణాలు టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నారని..... బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ కులానికి చెందిన వారు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ చెబుతోంది. మరోవైపు వైసీపీ ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖ ప్రాంతాల్లో ర్యాండమ్ సర్వే చేయించింది. 
 
ఈ సర్వేలో 1707 మంది అభిప్రాయాలను సేకరించగా 64 శాతం మంది జగన్ పాలన బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 26 శాతం మంది అస్సలు బాగోలేదని.... 10 శాతం మంది మాత్రం పరవాలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు రాష్ట్రంలో అవినీతి రహిత పాలన జరుగుతోందని, వాలంటీర్ల, సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ పథకాల అమలు సరిగ్గా జరుగుతోందని... కోర్టుల్లో జగన్ ను ఇబ్బందులు పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తపరిచారు. అదే సమయంలో మద్యం రేట్లు పెంచడం, ఇసుక పాలసీ విషయంలో జగన్ సర్కార్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: