ఏదైనా కేసులో కింది కోర్టు తీర్పుపై అనుమానాలు ఉన్నాయని ఆ తీర్పును సవాల్ చేస్తున్నామని ఎవరైనా కోరితే సాధారణంగా సుప్రీం కోర్టు ఆ తీర్పుపై స్టే ఇవ్వడం జరుగుతుంది. అయితే నిమ్మగడ్డ కేసులో మాత్రం సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు కానీ పిటిషన్ ను విచారణకు మాత్రం స్వీకరించింది. విచారణకు స్వీకరించడాన్ని వైసీపీ పాజిటివ్ గా భావిస్తుండగా సుప్రీం స్టే ఇవ్వకపోవడంతో జగన్ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ అని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. 
 
అయితే సుప్రీం విచారణకు స్వీకరించినప్పటికీ కోర్టు తుది తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. వాస్తవానికి పంచాయతీ రాజ్ చట్టం ప్రకారమే నిమ్మగడ్డ రమేష్ నియామకం, కనగరాజ్ నియామకం జరిగింది. కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ప్రభుత్వం సిఫార్సు చేయకూడదని.... గవర్నర్ నియమించాలని చెప్పింది. అయితే గతంలో టీడీపీ నిమ్మగడ్డ రమేష్ ను సిఫార్సు చేసిందని... అందువల్ల ఆయన నియామకం కూడా చెల్లదని వైసీపీ చెబుతోంది. 
 
ఇలా నిమ్మగడ్డ వ్యవహారంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు ఎందుకు స్టే ఇవ్వలేదనే ప్రశ్నకు కొందరు న్యాయవాదులు ఆసక్తికరమైన సమాధానాలను చెప్పుకొచ్చారు. ఈ కేసులో ముందుగా కేవియట్ దాఖలు కావడం వల్లే హైకోర్టు స్టే ఇవ్వలేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వవద్దని దాఖలైన కేవియట్ వల్లే జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
అయితే జగన్ సర్కార్ హైకోర్టు తీర్పుపై అనుమానాలు ఉన్నాయని కేవియట్ దాఖలు చేసి ఉంటే బాగుండేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం కేవియట్ వల్ల్ స్టే ఇవ్వలేదని సుప్రీం చెప్పలేదు కాబట్టి కేవియట్ వల్లే స్టే ఇవ్వలేదని జరుగుతున్న ప్రచారం తప్పని చెబుతున్నారు. గతంలో రెండు కేసుల్లో సుప్రీంలో ఎదురుదెబ్బలు తగిలాయని.... ఈ కేసు తుది తీర్పులో కూడా జగన్ సర్కార్ కు అనుకూలంగా తీర్పు రాకపోవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: