తోట త్రిమూర్తులు...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత. కాపు సామాజికవర్గానికి చెందిన ఈయనకు తూర్పు గోదావరి జిల్లాలో మంచి పట్టు ఉంది. అలాగే పార్టీలు మారినా..ఈయన వెనుకే రామచంద్రాపురం ప్రజలు ఉండేవారు. కానీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తోటకు జగన్ గాలిలో ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక ఓడిపోయాక కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న త్రిమూర్తులు సడన్‌గా వైసీపీ కండువా కప్పేసుకున్నారు.

 

అయితే వైసీపీలో చేరాక ఈయనకు పెద్దగా కలిసొచ్చింది ఏమి లేదు. అప్పటికే రామచంద్రాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్...ఇటు ఈయన చిరకాల శత్రువు పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రిగా ఉన్నారు. దీంతో ఈయన పరిస్తితి ఎటు కాకుండా అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ జగన్ ఎవరికి అన్యాయం జరగనివ్వరు కాబట్టి...వెంటనే తోటని అమలాపురం వైసీపీ పార్లమెంటరీ అధ్యక్షుడుగా నియమించారు.

 

దీంతో పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో మండలి రద్దు తోటకు కలిసొచ్చింది. మండపేటలో పిల్లి ఓడిపోవడంతో అప్పటికే ఎమ్మెల్సీ పదవి ఉండటంతో... జగన్ మంత్రి పదవి ఇచ్చారు. కానీ మండలి రద్దు చేయడంతో పిల్లికు రాజ్యసభ సీటు ఇచ్చారు. దీంతో జగన్ మండపేట బాధ్యతలు తోటకు అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత తీసుకుని తోట పనిచేస్తున్నారు.

 

అలాగే వచ్చే ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి తోట పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రామచంద్రాపురంలో ఎలాగో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటం వల్ల, తోటకు మండపేట సీటు దక్కొచ్చు. అయితే తోటకు సీటు దక్కినా...విజయం దక్కడం అంత సులువ కాదు. ఎందుకంటే మండపేటలో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు బలంగా ఉన్నారు. ఇక్కడ కమ్మ ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. కమ్మ ఓట్లతో పాటు సమానంగా కాపు ఓట్లు ఉన్నాయి.

 

ఒకవేళ కాపు ఓట్లతో తోట రాజకీయం చేద్దామనుకున్న...ఆయన అంటే అస్సలు పడని శెట్టిబలిజలు వేగుళ్ళకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. కాబట్టి తోటకు అవకాశం దొరికినా..కానీ అదృష్టం లేకపోతే విజయం అందడం చాలా కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: