ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏపీ ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి సంబంధించి ఇక రాజకీయాలు మరోసారి హాట్ హాట్ గా మారబోతున్నాయి. నిన్ననే చంద్రబాబు హయాంలోని ఫైబర్ నెట్, చంద్రన్న కానుక వంటి పథకాలపై సీబీఐ విచారణ జరిపించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇక ఇప్పుడు అచ్చెన్నాయుడు అరెస్టుతో ఏపీ రాజకీయం మరొక్కసారి వేడెక్కింది. అయితే ఈ అరెస్టుల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

 

ఎందుకంటే.. ఈ ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడితో పాటు మరో మాజీ మంత్రి పాత్ర కూడా ఉందని సమాచారం వస్తోంది. మరో మంత్రి కుమారుడు కూడా ఈఎస్‌ఐ టెండర్ల స్కామ్‌లో ఉన్నాడట. ఇప్పుడు అచ్చెన్నాయుడి అరెస్టుతో ఆ మాజీ మంత్రి, మంత్రి కుమారుడి గుండెళ్లో రాళ్లుపడ్డాయి. ఇక వారు పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

 

 

అయితే ఈ అరెస్టు వ్యవహారంపై వీలైనంత రచ్చ రచ్చ చేయాలని టీడీపీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ప్రభుత్వం కిడ్నాప్ చేసిందని ప్రతిపక్షనేత చంద్రబాబు మండిపడుతున్నరాు. కనీసం ముందస్తు నోటీసు కూడా లేకుండా వంద మంది పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేసి వంద మంది పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి అచ్చెన్నాయుడుని ఎత్తుకెళ్లారు అని యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. అచ్చెన్నాయుడు ను అక్రమంగా తీసుకెళ్లడం అప్రజాస్వామికం అంటున్నారు.

 

 

ఈ కిడ్నాప్ కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మరికొందరు నేతలు అంటున్నారు. అచ్చెన్నాయుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో.. డిజిపి సమాధానం చెప్పాలని... హోంమంత్రి రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద అచ్చెన్నాయుడి అరెస్టుతో తెలుగుదేశం నేతలు మాత్రం వేగంగా స్పందిస్తున్నారు. తదుపరి వ్యూహం రెడీ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: