నేటి సమాజంలో చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ దాక అందరు సోషల్ మీడియాను వాడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరస్తులు అమ్మాయిలను వలల వేసుకొని వారి దగ్గర నుండి నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. మరి కొంత మంది అమ్మాయిలకు ప్రేమ పేరుతో వలల వేసుకొని వారిని నమ్మించి మోసం చేస్తున్నారు. అయితే తాజాగా అదే కోణంలో మరో ఘటన చోటు కడప జిల్లాలో చేసుకుంది. 

 

 

అతనికి మాములుగా బట్టతల అయితేనేం విగ్గుతో కవర్ చేస్తాడు. అందులో తప్పులేదు. కానీ కవర్ చేసి అందంగా ముస్తాబయ్యి ఫేస్‌బుక్‌లో యువతులకు వల విసురుతాడు. పరిచయమైన యువతుల, మహిళల ఫొటోలు తీసుకుని వాటిని ఉపయోగించి మార్ఫింగ్ చేస్తాడు. వాటితో అందరిని బెదిరిస్తాడు. వారి దగ్గర నుండి డబ్బు, బంగారం దోచేస్తాడు. 

 

 

అయితే ఈ కేటుగాడు ఎట్టకేలకు కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్‌ డివిజన్‌ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా పగిడ్యాలకు చెందిన రాజ్‌కుమార్‌ మారుపేర్లతో ఫేస్‌బుక్‌లో అకౌంట్లు నడుపుతుంటాడు. ఇతనికి భార్య, పిల్లలు ఉండగా.. కొంతకాలంగా రాజుపాళెంలో ప్రైవేటు పాఠశాల నడుపుతున్నాడు. 

 

 

వివరాల్లోకి వెళ్తే... రాజుపాళెంలో ప్రైవేటు స్కూల్ నిర్వహిస్తున్న రాజ్‌కుమార్ అక్కడే పనిచేసే ఓ లేడీ టీచర్‌కు మాయమాటలు చెప్పి కారులో గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని ఓ గ్రామానికి తీసుకెళ్లి నిర్బంధించి చిత్రహింసలు పెట్టాడు. కూతురు కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు యువతి కోసం గాలింపు చేపట్టారు.

 

 

ఈనెల 1వ తేదీన బాధితురాలు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించగా.. ప్రొద్దుటూరు పోలీసులు రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే విచారణలో రాజ్‌కుమార్‌ ఫేస్‌బుక్‌లో పలువురిని మోసగించి డబ్బు, బంగారం దోచుకున్నట్లుగా తేలింది. దీంతో నిందితుడిపై వివిధ రాష్ట్రాల్లో 12 కేసులు నమోదయ్యాయని పోలీసు అధికారులు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: