ఆన్ లైన్ లో ఏదైనా వస్తువు ఆర్డర్ పెడితే మరొకటి డెలివరీ అవ్వడం... అది చూసి మనం ఆగ్రహించడం, కంపెనీకి ఫోన్ చేసి తిట్టడం సాధారణంగా జరుగుతుంటాయి. కానీ పుణేకు చెందిన గౌతమ్ అనే వ్యక్తి మూడు వందల రూపాయల విలువ చేసే స్కిన్ లోషన్ ని అమెజాన్ లో ఆర్డర్ పెట్టాడు. అయితే అతడికి లోషన్ కి బదులు 2 లీటర్ల సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ లిక్విడ్ తో పాటు 19 వేల రూపాయల విలువ చేసే బోస్ కంపెనీ వైర్ లెస్ ఇయర్ బడ్స్ కలిగి ఉన్న ఒక ప్యాకేజీని డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. 


కొంతసేపటి తర్వాత గౌతమ్ తనకొచ్చిన ప్యాకేజీ తెరిచి చూడగా... లోపల ఉన్న వస్తువులను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వెంటనే అమెజాన్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. కానీ అమెజాన్ సంస్థ అతడికి సమాధానమిస్తూ.... పర్లేదు, సార్. మీరు ఇయర్ బడ్స్ ని తిరిగి ఇవ్వక్కర్లేదు. మీరే ఉంచుకోండి. ఎందుకంటే మీరు స్కిన్ కోసం చేసిన ఆర్డర్ నాన్ రిటర్నబుల్ జాబితాలోకి వస్తుంది' అని చెప్పింది. అలాగే స్క్రీన్ లోషన్ కోసం గౌతమ్ కట్టిన 300 రూపాయలు రిఫండ్ చేసింది. 

 

దాంతో 19 వేల రూపాయల ఇయర్ బడ్స్ ఉచితంగా రావడంతో అతను తెగ సంతోషించి ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. దీంతో ప్రతి ఒక్క నిమిషం నాకే ఎందుకు ఇలా జరగడం లేదు అంటూ తెగ అసూయ పడిపోతున్నారు. మరికొంత మంది నెటిజన్లు గౌతమ్ పోస్టుకు స్పందిస్తూ ఎటువంటి స్కిన్ లోషన్ కి ఆర్డర్ పెట్టారో కొంచెం చెప్పండి నేను కూడా ఆర్డర్ పెడతాం, ఇయర్ బడ్స్ ఫ్రీగా కొట్టేస్తాం అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అదృష్టం అంటే ఇదేనేమో అని మరికొంత మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: