చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన మాయదారి కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాపించింది. ప్రంచం మొత్తం మరణ మృదంగం వాయిస్తుంది.  ప్రపంచంలో కరోనా కారణంగా అత్యధికంగా దెబ్బతిన్న నాలుగవ దేశమైన భారతదేశంలో గత 24 గంటల్లో 11,000 కి పైగా కేసులు, మూడొందలకు మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన విషయం తెలిసిందే.  దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి.  అయితే కరోనా ని కట్టడి చేయడానికి గత రెండు నెలలు వీర పోరాటం చేసినా.. ఈ మద్య సడలింపు తర్వాత మళ్లీ కేసులు పెరగడం మొదలు పెట్టాయి.   

10 రోజుల క్రితం వరకు 2 లక్షలు ఉన్న కేసులు కేవలం అతి తక్కువ సమయంలోనే 3 లక్షలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో 101,141, ఢిల్లీ 36,824, తమిళనాడు 40,000, గుజరాత్ 22,525 మందికి కరోనా సోకిందని తాజా లెక్కలు తేల్చి చెప్పాయి.కాగా తాజా గణాంకాలతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 3,08,993 మందికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. వీరిలో 8,884 వైరస్ కాటుకు బలయయారు.

IHG

దాదాపు 1,54,330 మంది కోలుకోగా.. ఇంకా 1,45,779  మందికి ఆయా రాష్ట్రాల కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.   మార్చి లో మొదలైన కరోనా కేసులు ఇప్పుడు మరింత ఎక్కువ పెరిగిపోయాయి. వాస్తవానికి గత రెండు నెలల క్రితం ఇతర దేశాలతో పోల్చితే కరోనా కేసుల కంట్రోల్ చేసే  విషయంలో భారత్ ని ఇతర దేశాలు మెచ్చుకున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: