కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనా దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక దశలో దేశంలో కొత్త కేసులు నమోదు కాకపోవడంతో కరోనా ఫ్రీ దేశంగా చైనాను ప్రకటించాలని ఆ దేశం భావించింది. అయితే దేశంలో తాజాగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న నాలుగు కరోనా కేసులు నమోదు కాగా ఈరోజు ఏడు కేసులు నమోదయ్యాయి. చైనా రాజధాని బీజింగ్ లోనే ఈ కేసులు నమోదయ్యాయి. 
 
బీజింగ్ లో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో అధికారులు పాజిటివ్ సోకిన వారితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వారి నుంచి సన్నిహితుల వివరాలు సేకరించి అధికారులు వారందరినీ కరోనా పరీక్ష కేంద్రాలకు తరలించనున్నారు. గడిచిన 55 రోజుల్లో కనీసం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని చైనా దేశంలో అకస్మాత్తుగా కొత్త కేసులు నమోదు కావడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. 
 
మరో రెండు రోజులు బీజింగ్ లో కరోనా కేసులు నమోదైతే లాక్ డౌన్ ను ప్రకటించాలని ఆ దేశం భావిస్తోంది. కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ ను పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేసిన చైనా రెండో విడత కరోనా వ్యాప్తి చెందితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని భావిస్తోంది. దీంతో కేసులు నమోదైన బీజింగ్ లో మరోసారి లాక్‌డౌన్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనా దేశంలో ఇప్పటివరకు 83,086 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
వీరిలో 78,367 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 4634 మంది చికిత్సకు కోలుకోలేక మృతి చెందారు. . రెండోదశ వైరస్‌ వ్యాప్తి చెందకముందే లాక్‌డౌన్‌ ప్రకటించడం మేలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు భారత్ లో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారత్ లో గత 24 గంటల్లో 11,458 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 3,08,993కు చేరింది. కొత్తగా 386 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 8,884కు పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: