తెలంగాణలో అధికార పార్టీకి చెందిన జనగామ ఎమ్యెల్యే ముత్తిరెడ్డి యాదవగిరి రెడ్డికి కరోనా సోకగా తాజాగా అయన భార్య తో సహా డ్రైవర్ ,గన్ మెన్ ,వంట మనిషి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణయ్యింది. ఎమ్మెల్యే ప్రస్తుతం ఓప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనతో కాంటాక్ట్ అయిన వారికి  అధికారులు పరీక్షలు చేస్తున్నారు అందులో భాగంగా ఈ నలుగురుకి టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. ఇక ఎమ్మెల్యే కు కరోనా సోకిందనే వార్తతో ఇటీవల  ఆయనను కలిసినవారికి  భయం పట్టుకుంది. మరోవైపు ఎమ్మెల్యే ఎవరెవరిని కలిసారనే దానిపై అధికారులు అరా తీస్తున్నారు.  
 
ఇదిలావుంటే తెలంగాణలో ఈరోజు రికార్డు స్థాయిలో 253 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఒక్క జిహెచ్ఎంసి లోనే 179 కేసులు నమోదయ్యినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈకేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 4288కు చేరగా అందులో ప్రస్తుతం 2203కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఈరోజు కరోనాతో 8మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 182కి చేరింది. ఇప్పటివరకు 2352 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. కాగా కరోనాను హ్యాండిల్ చేస్తున్న తీరు పట్ల తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుంటే ఇప్పటివరకు కేవలం 42000టెస్టులు మాత్రమే చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: