తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్యా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా బారిన పడి అనేక మంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మరి కొంత మంది కరోనా పరీక్షల కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు జరుపుతున్న కరోనా టెస్టుల సంఖ్యతో పోలిస్తే మన రాష్ట్రంలో జరుగుతున్న టెస్టుల సంఖ్య చాలా తక్కువ. ఈ విషయంలో అటు కోర్టులు, ఇటు కేంద్రం కూడా రాష్ట్ర వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వింటూనే ఉన్నాము. 

 

 

ఐసీఎంఆర్‌ కూడా రాష్ట్రంలో వైరస్‌ కమ్యూనిటీ స్ప్రెడ్‌ కాలేదని, ప్రమాదం లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఆర్‌ – నాట్‌ శాతం కూడా 180 నుంచి 110కి తగ్గిందని నిపుణులు తెలుపుతున్నారు. కానీ అవసరం అనుకున్న వారికి టెస్టులు చేయకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.

 

 

కరోనా సోకిన వారితో సహజీవనం చేయాల్సిన వారికి పరీక్షలు చేయాలనే డిమాండ్‌ గట్టిగా వినిపిస్తోంది. తమకు పరీక్షలు చేయాలంటూ రోజూ 2 వేల మందికి పైగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని అంచనా వేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు. పరీక్షలు చేసేందుకు తమకు అనుమతి లేదంటూ ప్రైవేట్‌ వర్గాలు తిప్పి పంపడం, ప్రభుత్వ వర్గాలు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఐసొలేషన్‌లో ఉండాలంటూ ఉచిత సలహాలు ఇస్తుండటంతో వారికి ఏం చేయాలో పాలు పోవట్లేదంటున్నారు.

 

 

రాష్ట్రంలో సామాన్యులను వెనక్కి పంపిస్తున్న ప్రభుత్వ వైద్య వర్గాలు.. పలుకుబడి ఉన్న వారికి మాత్రం అడిగిందే తడవుగా పరీక్షలు చేయడం మరిన్ని విమర్శలకు కారణం అవుతోందన్నారు. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులకు ఒక విధానం, మాకు మరో విధానమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం సాధ్యం కాకపోయినా నిజంగా అవసరమైన వారిని వెనక్కి పంపొద్దని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: