ప్రస్తుతం మీడియా ఛానెళ్లు, ప్రముఖ పత్రికల అధినేతలు వారికి నచ్చిన వారి విషయంలో ఒక విధంగా నచ్చని వారి విషయంలో మరో విధంగా వ్యవహరిస్తున్నారు. వారికి నచ్చితే అవతలి వ్యక్తులను గొప్ప మనుషులుగా.... నచ్చకపోతే దుర్మార్గుడిగా చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఒక టీడీపీ అనుకూల మీడియా అధినేత కొత్త పలుకులో చిరంజీవి ఇతర సినీ ప్రముఖులతో జగన్ ను కలవడంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. 
 
మీడియా అధినేత సినీ ప్రముఖులు అమరావతిలో ధర్నాలు చేసిన వాళ్లను కలవకుండా సినీ ప్రముఖులు జగన్ ను కలిసొచ్చారని... ఆస్తులు సంపాదించుకోవడానికి జగన్ ను కలిశారని తన పలుకులలో పేర్కొన్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకునే హీరోలను ప్రజలు పట్టించుకోవడం లేదని.... 60 ఏళ్లకు పైబడిన హీరోలను కూడా పట్టించుకోవడం లేదని సీనియర్ స్టార్ హీరోల వయస్సుపై వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. 
 
మరి చిరంజీవి సైరా సినిమా, బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు, వెంకటేష్ ఎఫ్ 2, నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాలు భారీ కలెక్షన్లు ఎలా సాధించాయో ఆయనే చెప్పాలి. ఆ మీడియా అధినేత ఆ స్టార్ హీరోల్లో ఒకరి విషయంలో ఒకలా మరొకరి విషయంలో మరోలా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. ఆయన అనుకూల రాజకీయ పార్టీ నేతలను కలిస్తే ఒకలా మరో పార్టీ నేతలను కలిస్తే ఆ మీడియా అధినేత వ్యవహరిస్తున్నారు. 
 
మీడియా అధినేత ఈ విధంగా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీల గురించి ఆ సమయంలో ఒకలా... వివిధ కారణాల వల్ల పొత్తు విడిపోయిన తరువాత మరోలా ఆయన వ్యవహరించారు. 2019 ఎన్నికల ముందు కూడా కొన్ని నెలల పాటు ఆ మీడియా అధినేత పత్రిక, మీడియా ఛానెల్ లో లో టీడీపీ అనుకూల వార్తల కంటే జగన్ వ్యతిరేక వార్తలకే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: