ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి వల్ల కేవలం మూడు రోజుల పాటు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే సమావేశాలు ఎన్ని రోజులు జరిగినా...అసెంబ్లీలో మాత్రం వైసీపీ హవా ఏకపక్షంగా సాగడం ఖాయం. 151 వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ, ఒక జనసేన ఎమ్మెల్యే మొత్తం 155 మంది ఎమ్మెల్యేలు ఓ వైపు ఉంటే, మరో 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మరోవైపు ఉంటారు.

 

మళ్ళీ 20 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది సమావేశాలకు డుమ్మా కొడతారో చెప్పలేని పరిస్తితి ఉంది. ఇప్పటికే చంద్రబాబుకు అండగా ఉంటూ టీడీపీలో ధీటుగా నిలబడే అచ్చెన్నాయుడుని ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో ఏసీబీ అరెస్ట్ చేసింది. దీంతో చంద్రబాబుకు సపోర్ట్‌గా, వైసీపీకి ధీటుగా గళం విప్పే ఎమ్మెల్యేల్లో నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరీలు ఉన్నారు. కానీ అసెంబ్లీలో వారి వాయిస్ చాలదు.

 

ఇలాంటి తరుణంలో మంచి వాక్చాతుర్యం, సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతూ...ప్రత్యర్ధులకు చెక్ పెట్టే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గళం విప్పితే బాగుంటుందని తెలుగు తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పయ్యావుల...టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గతంలో అంటే 2004,2009 టైమ్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ..అప్పటి వైఎస్సార్ ప్రభుత్వానికి ధీటుగా నిలబడ్డారు. కానీ 2019 ఎన్నికల్లో గెలిచాక కేశవ్...పెద్ద యాక్టివ్‌గా ఉండటం లేదు. కీలకమైన పి‌ఏ‌సి ఛైర్మన్ పదవి దక్కించుకున్న కూడా అధికార వైసీపీని ఇబ్బందిపెట్టే కార్యక్రమం ఒక్కటి కూడా చేయలేదు.

 

అయితే ఆ మధ్య మాత్రం అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్‌లో తన పేరు తీసుకొచ్చినందుకు పయ్యావుల తనదైన శైలిలో మాట్లాడి, వైసీపీకి కాస్త చెక్ పెట్టారు. అయితే అదే తరహాలో ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ...బాబుకు సపోర్ట్ ఉంటే బెటర్ అని, లేదంటే వైసీపీ ఇంకా ఆడేసుకుంటుందని తమ్ముళ్ళు అనుకుంటున్నారు. మరి తమ్ముళ్ళు అనుకున్నట్లు కేశవ్..వైసీపీకి ధీటుగా నిలబడి బాబుకు సపోర్ట్ ఇస్తారో? లేక అసలు అసెంబ్లీ సమావేశాలకే హాజరుకాకుండా బాబుకు షాక్ ఇస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: