గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓ వైపు కరోనా వైరస్ ప్రభావం కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఎప్పటికప్పుడు తమ మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు.  ప్రజలకు అందాల్సిన పథకాలు అమలు చేస్తున్నారు. ఇక ఏ చిన్న ఛాన్స వచ్చినా.. అధికార పక్షంపై నిప్పులు చెరుగుతున్నారు ప్రతిపక్ష నేతలు.  ఏపి రాజకీయాల్లో కొంత కాలంగా టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

 

తాజాగా భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే, ఆళ్లగడ్డ నగర పంజాయతీ పరిధిలోని పడకండ్ల గ్రామంలో పొలం దారి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో, ఇరు వర్గాలను పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చారు.  ఈ నేపథ్యంలోనే పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ మాజీ కౌన్సిలర్ ను బలవంతంగా పీఎస్ నుంచి అఖిలప్రియ సోదరుడు తీసుకెళ్లారు. 

 

వెంటనే అలర్ట్ అయిన పోలీసులు హుటాహుటిన అఖిలప్రియ నివాసానికి వెళ్లి, సదరు నిందితుడిని మళ్లీ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో జగత్ విఖ్యాత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 353, 224, 225, 212 కింద ఐఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా,  స్టేషన్ నుంచి నిందితుడిని తీసుకెళ్లారంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: