ఈ మద్య ఏపిలో రాజకీయాలో మహా వాడీ వేడిగా సాగుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో విభేదాలు తీవ్రరూపు దాల్చిన నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తన వ్యాఖ్యలతో వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు.  తిరుపతి వెంకన్న భూముల వేలం, ఇసుక మాఫియా అక్రమాలు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అక్రమ వసూళ్లు, భూముల కొనుగోళ్లలోనూ అవకతవకలు జరుగుతున్నాయని కొంతకాలంగా సీఎం జగన్ దృష్టికి తీసుకెళుతుంటే వైసీపీ వాళ్లే నొచ్చుకున్నారని తెలిపారు. దాంతో సొంత పార్టీ నుంచే తనపై విమర్శలు వస్తున్నాయని అన్నారు.

IHG

తాజాగా రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు ఎమ్మెల్యే ప్రసాదరాజు తప్పుపట్టారు. కరోనా సమయంలో కూడా జగన్ అందరితో కలుస్తున్నారని ఆయన చెప్పారు. ఆయనను కలవాలనే ఆలోచన మనస్పూర్తిగా ఉంటే... తప్పకుండా కలిసే అవకాశం ఉందని అన్నారు.  ప్రస్తుతం పరిస్థితులు కూడా నాయకులు అర్థం చేసుకోవాలని.. ముఖమంత్రి జగన్ పిలిస్తే పలికే వ్యక్తి అని.. అలాంటి నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భాదాకరం అని అన్నారు. జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఎంపీ స్థాయి వ్యక్తి మాట్లాడటం బాధాకరమని... ఆయన వ్యాఖ్యలు ప్రార్టీ శ్రేణులకు బాధను కలిగించాయని చెప్పారు. 

IHG

జనంలోకి వెళ్లి జనం కష్టాలు దగ్గరుండి చూసిన వ్యక్తి జగన్ అని.. అందుకే ఆయన అంటే జనానికి, నేతలకు ఇష్టం, గౌరవం అని అన్నారు. పక్క చూపులు చూడాల్సిన అవసరం జగన్ కు లేదని... ఏ చూపు చూస్తే మీరు పార్లమెంటు కమిటీ పదవి దక్కించుకున్నారని ప్రశ్నించారు. మరోవైపు, రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు వైసీపీలో అంతర్గతంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: