ఈ మద్య సోషల్ మీడియాలో వస్తున్న వైరల్ వీడియోలు చూస్తుంటే నిజంగా ఇలా కూడా జరుగుతుందా అన్న అనుమానాలు వస్తుంటాయి. సోషల్ మీడియా వేధికగా వింతైన సంఘటనలు మన కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు.  కొన్ని సార్లు నవ్వించినా.. కొన్ని సార్లు కన్నీరు పెట్టిస్తుంటాయి. తాజాగా ఓ యువతి చేసిన ఘనకార్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) లో ఓ వింత సంఘటన జరిగింది. దుబాయిలోని అల్ మంజార్ బీచ్ దగ్గర ఓ మహిళ ఆమె కారును పార్క్ అందులో కూర్చొని ఉంది. అప్పుడే ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడే వ్యక్తి ఆమెకు ఓ బాధాకరమైన వినిపించారు. 

 

ఫోన్ ఆమెను ఎంతగా బాధించిందంటే.. తాను కారు నడుపుతున్నాను.. ఎటు వెళ్తున్నా అన్న విషయం కూడా మర్చిపోయింది. దీంతో ఆమె టెన్షన్‌లో అనుకోకుండా యాక్సిలరేటర్‌ను తొక్కింది. ఇంకేముంది కారు ఒక్క సారిగా ఎదురుగా ఉన్న సముద్రంలోకి దూసుకెళ్లింది. కారు సముద్రంలోకి వెళ్లడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

 

ఈ సంఘట చూసి నిజీంగా ఎవరైనా ఇంత సాహసం చేస్తారా అన్న అనుమానం వచ్చి వెంటే అక్కడకు చేరుకున్నారు. అలాగే పోలీసులు రెస్యూ టీంతో అక్కడికి చేరుకుని కారులో ఉన్న మహిళను సురక్షింతంగా ఒడ్డకు చేర్చారు. మహిళకు ఎటువంటి గాయాలు కాలేదని పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆమె కారును కూడా రెస్క్యూ టీం అధికారులు బయటికి తీశారు. అందుకే డ్రైవింగ్ చేసే సమయంలో ఒళ్లు దగ్గర పెట్టుకొని నడపాలని అధికారుల సూచిస్తుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: