వైసీపీలో జగన్ చెప్పిందే వేదం.. జగన్ చెప్పిందే శాశనం. వైసీపీ అనే కాదు.. ప్రాంతీయ పార్టీల్లో అధినాయకుడు చెప్పిందే చెల్లుబాటు అవుతుంది. కాదూ కూడదనుకునేవాళ్లకు ఆయా పార్టీల్లో స్థానం ఉండదు. అయితే వైసీపీలో సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం అధినేత జగన్ కు చుక్కలు చూపిస్తున్నారనుకోవాలి. తరచూ ప్రభుత్వం తీరును విమర్శిస్తూ వార్తలకెక్కుతున్నారు.

 

 

రఘురామకృష్ణంరాజు.. ఎంపీగా ఎన్నికైన తొలిరోజుల నుంచే తేడాగా ఉన్నారు. ఇక ఇప్పుుడు ఆయన వైసీపీ వ్యతిరేక మీడియాకు కల్పతరువుగా మారిపోయారు. నిత్యం ప్రభుత్వాన్ని, జగన్ వైఖరిని, పార్టీ పెద్దల వైఖరిని విమర్శిస్తూ మీడియాకు ఎక్కుతున్నారు. తాజాగా ఇది చాలదన్నట్టు పార్టీలోని సొంత సామాజిక వర్గం నేతలపైనే విమర్శలు చేస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు.

 

IHG

 

తాజాగా ఆయన విడుదల చేసిన వీడియోలో.. తనకు వైసిపి పార్టీనే బతిమలాడి టిక్కెట్ ఇచ్చిందని, తన వల్ల ఎమ్మెల్యేలు అధికంగా గెలుస్తారని బతిమలాడిందని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో టిడిపి మీడియాలో ప్రసారం అవుతోంది. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలకు సమాధానం పేరుతో ఆయన ఈ వీడియో విడుదల చేశారు. టిడిపి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును కూడా ఆయన తప్పు పడుతూ టిడిపి మీడియాలో మాట్లాడారు.

 

 

ఈయన వ్యవహారం చూస్తుంటే.. ప్లీజ్ నన్ను సస్పెండ్ చెయ్యి జగన్... నా దారి నేను చూసుకుంటా అనేలా కనిపిస్తున్నారు. వైసిపి నాయకత్వం కూడా నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజు పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నోటీసు జారీ చేసిన తర్వాత సరైన జవాబు రాకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: