తెలుగు రాష్ట్రాల్లో ఓ పక్కన కరోనా మహమ్మారి తనదైన శైలిలో వ్యాప్తి చెందుతుంటే, మరోవైపు రాజమండ్రిలో కరోనా నిబంధనకు విరుద్ధంగా ఓ పాఠశాలను ఓపెన్ చేశారు అధికారులు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్ లు మూత పడిన సంగతి తెలిసిందే. కొన్ని పాఠశాలలు మాత్రం వాట్సాప్ లో హోం వర్కులు, ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ కొనసాగిస్తున్నారు. ఇకపోతే రాజమండ్రిలో మాత్రం కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ స్కూల్ ఓపెన్ చేశారు.

 


అనపర్తి మండలం ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ను ఆ స్కూల్ యాజమాన్యం తెరిచింది. ఇంకేముంది ఆ చిన్నారులు స్కూల్ డ్రెస్ వేసుకొని టిఫిన్ బాక్స్ తీసుకుని, బుక్స్ బ్యాగ్ లో పెట్టుకొని సరాసరి పాఠశాలకు వచ్చేశారు. గత 80 రోజుల నుంచి స్కూలు మూసివేయడంతో ఒక్కసారిగా తేల్చడంతో పిల్లల యూనిఫామ్ తో చకచక పాఠశాలకు చేరుకున్నారు. ఇక ఈ విషయం పై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం అటు తెలంగాణలోనూ, ఇటు తమిళనాడులోనూ పదో తరగతి పరీక్షలను నిర్వహించడం రద్దు చేసిన సంగతి అందరికీ విదితమే. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ దృష్టిలో పెట్టుకొని కూడా విద్యార్థుల హాని కలుగుతుందన్న జ్ఞానం లేకుండాప్రాణాల్ని పణంగా పెట్టి పరీక్షలు ఎలా నిర్వహిస్తారు అన్న విషయంపై అనేక మంది పిల్లల తల్లిదండ్రులు ఆందోళనను తెలుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రద్దు చేయాలని వారు కోరుతున్నారు. ఇకపోతే కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతనే పాఠశాలలు, కాలేజీలు తెలుసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

ఇలాంటి పరిస్థితులలో స్కూల్ తెరవడం పై అనేకమంది తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి గుర్తుంచుకొని పాఠశాలను తెరవాలని కొందరు కోరుతున్నారు. ఇకపోతే నేడు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 264 కేసులు నమోదయ్యాయి. కాకపోతే ఇందులో రాష్ట్రానికి చెందిన వారు 193 మంది కాగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి నుంచి 44 మందికి కరోనా సోకింది. అలాగే వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి 27 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: