చైనా భారత్ వివాదం ప్రశాంతంగా పరిష్కారమవుతుందన్న సమయంలో వివాదం సరికొత్త మలుపులు తీసుకుంటోంది. చైనాకు సంబంధించిన సైన్యం వెనక్కు వెళితే మన సైన్యం కూడా వెనక్కు వెళుతుందని ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. చైనా సైనికులు మొత్తం ఎనిమిది సరిహద్దు ప్రాంతాల్లో ఆరు ప్రాంతాల నుంచి వెళ్లిపోగా రెండు ప్రాంతాల్లో మాత్రం ఉండిపోయారు. అయితే మిగిలిన రెండు సరిహద్దు ప్రాంతాల్లో ఒకటైన గాల్వన్ లోయ దగ్గర ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 
 
చైనా సైనికులు భారత్ సైనికుల మధ్య జరిగిన దాడుల్లో భారత్ కు చెందిన ఒక కల్నల్, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన చోటు చేసుకోవడంతో వివాదం ఎక్కడికి దారితీస్తుందో అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులు జరిగాయని కొంతమంది అభిప్రాయపడుతుండగా కాల్పులు జరగలేదని మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. నిన్న రాత్రి ఈ ఘటన జరగగా ఆలస్యంగా సమాచారం బయటకు వచ్చింది. 
 
చైనా సైనికులు వెనక్కు వెళ్లినట్టే వెళ్లి మనవాళ్లపై రాళ్లతో దాడి చేస్తే ఒక కల్నల్, ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. చైనా మాత్రం భారత్ చైనా భూభాగంలోకి చొరబడుతుంటే అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా దాడి జరిగిందని వారు చెబుతున్నారు. ఐతే భారత్ మాత్రం చైనా సైనికులే వెనక్కు వెళ్లినట్టే వెళ్లి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని చెబుతోంది. ఈ పరిణామాలు ఏ వైపుకు దారి తీస్తాయో తెలియాల్సి ఉంది. 
 
ఈ పరిణామాల వల్ల భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో భారత్ తెలివిగా వ్యవహరించాల్సి ఉంది. భారత్ చైనా వ్యూహాలకు ప్రతివ్యూహాలను పన్నాల్సి ఉంది. చైనా భారత్ సరిహద్దు వివాదం మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. సమస్య పరిష్కారమవుతుందన్న సమయంలో ఈ విధంగా జరగడంతో భారత్ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: