అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 200 వెంటిలేటర్ల ను భారతదేశానికి అందిస్తానని గతంలో హామీ ఇచ్చిన సంగతి విదితమే. అయితే మంగళవారం అనగా ఈ రోజున మొదటి విడతగా 100 వెంటిలేటర్ లను ఇండియా లోని రెడ్ క్రాస్ సంస్థ కు అమెరికా ప్రభుత్వం తమ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ద్వారా అందజేసినట్టు మన దేశంలోని అమెరికా దౌత్యవేత్త కెన్నత్ జస్టర్ తెలిపాడు. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ భారతదేశంలోని రెడ్ క్రాస్ సంస్థ, భారత ఆరోగ్య శాఖ తో పాటు ఇతర వాటాదారులతో కలసి పని చేస్తూ వెంటిలేటర్లను సక్రమంగా పంపిణీ చేస్తుంది. 


వెంటిలేటర్లను భారత దేశానికి ఇచ్చిన సందర్భంగా అమెరికా దౌత్యవేత్త కెన్నత్ జస్టర్ మాట్లాడుతూ... 'కొవిడ్-19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ప్రమాదంగా మారింది. మనమందరం కలిసికట్టుగా ఉంటూ కరోనాపై పోరులో సహాయం చేసుకుంటుంటేనే ఈ మహమ్మారి పై విజయం సాధించగలం. ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించగలదు. ఈ ఉద్దేశంతోనే అమెరికా ప్రభుత్వం వెంటిలేటర్ల ను దానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నది', అని చెప్పుకొచ్చాడు. 


భారతదేశానికి 9.5 మిలియన్ల డాలర్ల విలువచేసే వైద్య సదుపాయాలను పరికరాలను అమెరికా ప్రభుత్వం దానం చేస్తానని చెప్పింది. అయితే ఇప్పటికే 1.2 మిలియన్ల డాలర్ల విలువ చేసే వెంటిలేటర్ లను అమెరికా ప్రభుత్వం ఇండియాకి దానం చేసింది. ఈ వెంటిలేటర్లను మే నెలలోనే అమెరికా ప్రభుత్వం భారత దేశానికి పంపించాలని అనుకుంది కానీ ఆ సమయంలో ఇరుదేశాలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నామని వెంటిలేటర్ల అవసరం లేదనే ధీమాతో ఉండిపోయాయి. కానీ వ్యాక్సిన్ తయారు చేయడం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అలాగే భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి బీభత్సంగా పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీ కి ఫోన్ చేసి వెంటిలేటర్ల విషయం గురించి మాట్లాడగా... వెంటిలేటర్ల పంపిణీపై మోడీ సానుకూలంగా స్పందించాడు. డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చిన విధంగా వెంటిలేటర్లను భారతదేశానికి పంపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: