టీడీపీ నేతలకు ఇది చాలా బ్యాడ్ టైమ్ లా ఉంది. ఇప్పటికే ఓ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వివిధ కేసులతో జైల్లో కూర్చోగా.. ఇప్పుడు మరో మాజీ మంత్రికీ అదే గతి పట్టేలా కనిపిస్తోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

 

 

అంతే కాదు..ఏకంగా 354a (iv), 500, 504, 505( 1) b, 505(2),506,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంటే నిర్భయ కేసులు ఉన్నమాట. మున్సిపల్ కమిషనర్ ఎస్ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదయింది. సోమవారం ఉదయం తన కార్యాలయం ముందు జరిగిన ఆందోళన కార్యక్రమం, ఆ తర్వాత గవిరెడ్డి అనే వ్యక్తి తనను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తో మాట్లాడాలని కోరడం జరిగాయని ఆమె తెలిపారు.

 

IHG

 

అయ్యన్నపాత్రుడు తాత రుత్తల లత్స పాత్రుడు చిత్రపటం తొలగింపు పై మాజీ మంత్రి అయ్యన్న ప్రశ్నించారని ఆమె చెప్పారు. ప్రస్తుతం హాల్ నవీకరణ జరుగుతున్నందున, ఆ ఫోటోను భద్రపరిచినట్టు చెప్పానని కమీషనర్ తెలిపారు. నవీకరణ పూర్తి అయిన తర్వాత తిరిగి యధాస్థానంలో పెడతానని చెప్పానని ఆమె తన ఫిర్యాదులో వివరించారు. అయితే పాత్రుని చిత్రపటం తొలగింపుపై మాజీ మంత్రి బెదిరించిన ధోరణిలో మాట్లాడారట.

 

 

అంతే కాదు.. ఆడ అధికారి కాబట్టి.. తాను మాట నిలబెట్టుకో పోతే బట్టలూడదీసి.... అంటూ బూతులు తిట్టారని ఆమె తన ఫిర్యాదులో వివరించారు. ఇవన్నీ ఓ మహిళా అధికారి గా తనకు తీవ్రమైన వేదన కలిగించాయని.. తాను స్వేచ్ఛగా విధి నిర్వహణ చేసే పరిస్థితి లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో నర్సీపట్నం పోలీసులు ఎఫ్..ఆర్ కూడా నమోదు చేశారు. మరి అయ్యన్నపాత్రుడు కూడా జైలు ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుందా.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: