భారత దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తుంది. ప్రతిరోజూ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దాదాపు 45 రోజులు లాక్ డౌన్ ఎంతో సీరియస్ గా చేశారు.. ఈ మద్య మళ్లీ షరా మూమూలు అన్నట్లు జనాలు తిరుగుతున్నారు.  ప్రభుత్వం చెప్పిన ఏ ఒక్క జాగ్రత్తలు పాటిండచం లేదు.. దాంతో కేసులు మరిన్ని పెరిగిపోతున్నాయని అంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే ఇప్పుడు మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు.. ఇందన ధరలు కూడా పై పైకి పెరిగిపోతున్నాయి. వాహనదారులకు ఇంధన ధరలు రోజు రోజుకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. వరుసగా పెరుగుదలను నమోదు చేస్తూ గరిష్ట స్థాయికి చేరాయి.

 

తాజాగా బుధవారం కూడా పెట్రోలుపై  55 పైసలు, డీజిలు పై 60పైసలు పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గడిచిన 11 రోజుల్లో ఏకంగా పెట్రోల్ పై రూ. 6, డిజిల్ పై రూ. 6.40 వరకు పెరిగింది. దీంతో వాహనదారులు పెట్రోల్ పంపుల వైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.  ఇక తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 80 దాటేసి రూ. 80.22కు చేరుకోగా, డీజిల్ ధర రూ. 74.07గా నమోదైంది.

 

ఏపీ రాజధాని అమరావతిలో లీటరు పెట్రోలు ధర హైదరాబాద్ కంటే ఎక్కువగా రూ.80.66గా ఉంటే, డీజిల్ ధర రూ. 74.54గా ఉంది. ఇక, ఢిల్లీలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ. 77.28, రూ.75.79గా నమోదు కాగా, చెన్నైలో  రూ. 80.86, రూ.73.69కి పెరిగాయి. లాక్ డౌన్ వల్ల ఇప్పటికే చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న జనాలకు పెట్రో మోత జేబుకు చిల్లుపెడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: